యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్ పెళ్లి వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి. అనిరుధ్ మామ చేసిన కామెంట్స్‌తో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ ఏడాదే పెళ్లి జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. మరి నిజమెంత?
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా విడుదల తర్వాత, ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలపై అనిరుధ్ గానీ, కావ్య గానీ అధికారికంగా స్పందించలేదు. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే.
23
మామ మాటతో పెరిగిన ఆసక్తి
అనిరుధ్‌కు మామ వరుసయ్యే నటుడు వై.జి. మహేంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఈ పెళ్లి వార్తలు మరింత జోరందుకున్నాయి. అనిరుధ్, కావ్య పెళ్లి చేసుకోబోతున్నారని తాను కూడా విన్నట్లు ఆయన చెప్పారు. కావ్య నాయకత్వ లక్షణాలను మెచ్చుకుంటూ, వాళ్లిద్దరూ అద్భుతమైన జంట అవుతారని అన్నారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తున్నా, ఇద్దరూ మౌనంగానే ఉన్నారు.
33
కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్న జంట
ఈ పెళ్లి రూమర్లు ఎలా ఉన్నా, ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్లలో చాలా బిజీగా ఉన్నారు. అనిరుధ్ చేతిలో విజయ్ 'జన నాయగన్', రజినీకాంత్ 'జైలర్ 2', షారుఖ్ ఖాన్ 'కింగ్' వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు, కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఈ వార్తలపై వాళ్లిద్దరూ స్పందించే వరకు, ఇవన్నీ రూమర్లే.