టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు, వరుస సక్సెస్ లతో సరికొత్తరికార్డును క్రియేట్ చేశాడు అనిల్. అంతే కాదు భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచాడట యంగ్ డైరెక్టర్. ఇంతకీ సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?
టాలీవుడ్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి రేంజ్ వేరు. పట్టిందల్ల బంగారం అయినట్టుగా.. చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. చిరంజీవిని ఎవరూ చూపించని విధంగా అనిల్ చూపించాడు. 70 ఏళ్ల వయసులో వింటేజ్ లుక్ లో మెగాస్టార్ మెరిసిపోయాడు. ఆయనలో ఉన్న ఎనర్జీని చాలా కాలం తరువాత బయటకు తీశాడు అనిల్. దాంతో సినిమా సూపర హిట్ అయ్యింది.. అనిల్ రేంజ్ మరో రేంజ్ కు వెళ్లిపోయింది.
25
సక్సెస్ రేటులో రాజమౌళి స్థాయి..
అసలే వరుససక్సెస్ లు..ఆపైన స్టార్ హీరోలతో వరుస అవకాశాాలు.. అనిల్ ట్యాలెంట్ ఆయన్ను స్టార్ డైరెక్టర్ గా మార్చాయి. రాజమౌళి తరువాత సక్సెస్ రేటు పూర్తి స్థాయిలో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే.. సెంటిమెంట్ తో ఏడిపించగలగడం అనిల్ కు బాగా వచ్చిన విద్య. ఆయన సినిమాలో హీరోయిజం డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత సీరియస్ క్యారెక్టర్ అయినా కామెడీ చేయించగలడు.. కామెడీ హీరోతో సీరియస్ పాత్రలు కూడా చేయించగలడు, ఈ మధ్యలో హీరో ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడతాడు అనిల్ రావిపూడి.
35
అనిల్ రావిపూడి కోసం స్టార్ హీరోల ఎదురుచూపులు..
అనిల్ రావిపూడి దగ్గర ఉన్న పెద్ద ట్యాలెంట్ ఏంటంటే.. ఆయన స్టార్ హీరో అయినా.. కొత్త హీరో అయినా.. ఎవరైనా సరే సక్సెస్ ఇవ్వగలడు. తన కథతో అద్భుతమైన విజయం అందేలా చేయగలడు. అందుకే గ్యారెంటీ హిట్ డైరెక్టర్ గా అనిల్ కు పేరు పడింది. ఇక సినిమా సినిమాకు సక్సెస్ కొడుతూ వెళ్తున్న అనిల్.. రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అన్ని జానర్స్ ఆడియన్స్ కు నచ్చేలా సినిమాలు చేయడంలో అనిల్ రావిపూడి రూటే సెపరేటు. స్టార్ దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కోసం స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమా అంటే.. కళ్లు మూసుకుని ఒకే చేసే పనిస్థితి
మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అనిల్ రావిపూడి 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం ముందు వరకు అనిల్ రావిపూడి 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే వారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా 300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో అనిల్ తన పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది. అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో... తాజాగా అనిల్ రేంజ్ మరో స్థాయికి వెళ్లింది. ఈసారి ఆయన చేయబోయే సినిమాకు 40 కోట్లకు పైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట అనిల్.
55
అనిల్ రావిపూడి నెక్ట్ సినిమా ఎవరితో?
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ ఏడాది చిరంజీవి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి ? ఏ హీరోతో చేయబోతున్నారు ? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరినీ చుట్టేస్తున్నారు. వెంకటేష్,బాలయ్య, చిరంజీవి అయిపోయాడు ఇక మిగిలింది నాగార్జున మాత్రమే. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ నాగార్జునతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా హలో బ్రదర్ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం.