తమన్నాకు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఆ గొడవే దీనంతటికి కారణం.!

Published : Jun 06, 2022, 11:22 AM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)కు, దర్శకుడు అనిల్ రావిపూడికి మధ్య జరిగిన గొడవ ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్న నిర్ణయం తమన్నాకు షాకిచ్చేదిగా ఉంది.  

PREV
16
తమన్నాకు ఊహించని షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఆ గొడవే దీనంతటికి కారణం.!

కరోనా తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ‘ఎఫ్3’(F3) కడుపుబ్బా నవ్విస్తోంది. ఆడియెన్స్ తమ ఫ్యామిలీతో థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మే27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. 
 

26

‘ఎఫ్2’కి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే ‘ఎఫ్3’. ఎఫ్2 సాధించిన ఘన విజయంతో అనిల్ రావిపూడి మరింత ఉత్సాహంతో ఎఫ్3తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. అయితే ‘ఎఫ్3’ చివరిలో ‘ఎఫ్4’ (F4) కూడా రానుందని స్వయంగా దర్శకుడే అనౌన్స్ చేశారు. దీంతో ఆడియెన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే మూడో భాగంలో హీరోయిన్ తమన్నా ఉండబోదని తెలుస్తోంది.
 

36

ఇందుకు కారణంగా కూడా అనిల్ రావిపూడి మరియు తమన్నాకు మధ్య జరిగిన గొడవనేని స్పష్టం అవుతోంది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘తమన్నాకు మీకు జరిగిన గొడవకు కారణం ఏంటీ’ అని అడిగిన ప్రశ్నకు ఆశ్చకరంగా సమాధానం ఇచ్చారు. 
 

46

అనిల్ మాట్లాడుతూ... షూటింగ్ సమయంలో స్టార్ కాస్ట్ ను అందరినీ సమన్వయం చేస్తూ పనిచేయడం దర్శకులకు సవాల్ లాంటిదే. ఈ క్రమంలో కాస్తా షూటింగ్ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. మన తెలుగు వాళ్లు ఏ టైంకైనా ఒకేనంటారు. ముంబయి యాక్ట్రెస్ టైమింగ్ మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్ర 6 గంటల వరకు ఉంటుంది.  ఈక్రమంలో ఒక సందర్భంలో తమన్నాకు మార్నింగ్ షూట్ షెడ్యూల్ అయ్యింది.
 

56

దీంతో ఆమె మార్నింగ్ రెగ్యూలర్ వర్క్ అవుట్స్ ఫినిష్ చేసుకోకుండా షూట్ కు రాలేనంటూ చెప్పేసింది. దీంతో కాస్తా హీట్ వెదర్ నెలకొంది. ఆ తర్వాత అంతా మమూలైపోయిందన్నారు. ఆ తర్వాత ఎఫ్4 స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుతూ ఎఫ్4లో హీరోలు మారకపోవచ్చు గానీ, హీరోయిన్స్ మాత్రం తప్పకుండా మారే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. దీంతో ఎఫ్4లో మిల్క్ బ్యూటీ కనిపించదని అర్థమైపోతోంది. 
 

66

ఎఫ్3లో వెకంటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో పోషించారు. తమన్నా భాటియా మరియు మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీక్వెల్ లో సునిల్, అలీ కూడా నటించడంతో సినిమాలో కామెడీ మరింత పండింది. 


 

click me!

Recommended Stories