ఇక యంగ్ హీరోల్లో అఖిల్ అక్కినేనికి కచ్చితంగా హిట్ కావాలి. ఎందుకంటే ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి విజయం అనేదే ఎరుగడు. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`పై ఆయన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మరి అది వర్కౌట్ అవుతుందేమో చూడాలి.
అఖిల్ ను ఇష్టపడేవారిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొంత మంది అయితే అఖిల్ పై విపరీతంగా క్రష్ పెంచుకుంటున్నారు. అందులో అందాల యాంకర్ విష్ణు ప్రియా కూడా ఉంది. రీసెంట్ గా అఖిల్ గురించి మాట్లాడిన ఆమె.. ఆయనపై ఉన్న ప్రేమను ఒక్కసారిగా గుమ్మరించేసింది.