పూల చీరలో మెరిసిన పాల రోజా.. జబ్బలు జాకెట్ లో సూపర్ హాట్ గా కేక పుట్టిస్తున్న స్టార్ యాంకర్ వర్షిణి!

First Published Sep 21, 2021, 11:06 AM IST

స్టార్ యాంకర్స్ లిస్ట్ లో వర్షిణి పేరు కూడా ఉంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి హాట్ యాంకర్స్ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ ఉన్న యాంకర్ గా వర్షిణి గుర్తింపు తెచ్చుకున్నారు. 
 


హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి, అక్కడ అవకాశాలు తగ్గడంతో యాంకర్ అవతారం ఎత్తారు. ఢీ షోలో కొన్నాళ్ళు యాంకర్ గా చేయగా, బాగా పాపులర్ అయ్యారు. 


సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే... హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. కారణం ఏమైనా కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమెను తొలగించారు. 

అక్కడ అవకాశం పోయినా స్టార్ మా లో కామెడీ స్టార్స్ షోకి సోలో గా యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు వర్షిణి. ఆ షో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది. 


ఇక బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో వర్షిణి పాల్గొంటున్నారని అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే వర్షిణి ఎంట్రీ ఇవ్వలేదు. ఐతే ఆమె వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళతారని మరో వార్త హల్చల్ చేస్తుంది. 

మరి అదే కనుక జరిగితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.ఈ హాట్ యాంకర్ అందాలు మరింత ఎక్కువగా చూస్తూ, ఆమె పెర్సనల్ లైఫ్ ని తెలుసుకునే అవకాశం దక్కుతుంది. 

ఇక సోషల్ మీడియాలో ఎప్పటిలాగే వర్షిణి హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. పూల చీర, స్లీవ్ లెస్ జాకెట్ లో హాట్ హాట్ ఫోజులిచ్చారు అమ్మడు. 

వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సాంప్రదాయ శారీలో సైతం గుండెలు జారేలా గ్లామర్ షో చేసింది హాట్ బ్యూటీ. 

click me!