యాంకర్‌ సుమ, సింగర్‌ సునీతలకు సన్‌ స్ట్రోక్‌.. ఇద్దరి కొడుకుల సినిమాలు డిజప్పాయింటెడ్.. ?

Published : Jan 07, 2024, 04:14 PM ISTUpdated : Jan 07, 2024, 04:20 PM IST

సుమ, సునీత తమ రంగాల్లో స్టార్స్ గా ఉన్నారు. తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి వచ్చాయి. వారికి పెద్ద స్ట్రోక్‌ ఇచ్చాయి. 

PREV
16
యాంకర్‌ సుమ, సింగర్‌ సునీతలకు సన్‌ స్ట్రోక్‌.. ఇద్దరి కొడుకుల సినిమాలు డిజప్పాయింటెడ్.. ?

స్టార్‌ వారసులు చిత్ర పరిశ్రమలో రాణించడం కొందరికే సాధ్యమైంది. వారసత్వాన్ని కొనసాగించడం అంటే అంత ఆశామాషీ కాదు. సొంత టాలెంట్‌ లేకపోతే ఇక్కడ నిలబడటం కష్టం. బలంగా ఆడియెన్స్ పై రుద్దితే కొందరు సక్సెస్‌ అయితే, సొంత టాలెంటెడ్‌తో మరికొందరు సక్సెస్‌ అవుతారు.  ఈ రెండూ చేయలేని వాళ్లు ఔట్‌ డేటెడ్‌ అవుతున్నారు. ఇండస్ట్రీలో పరిచయానికి బ్యాక్‌ గ్రౌండ్‌ అవసరమవుతుంది. ఆ తర్వాత వాళ్లే నిరూపించుకోవాల్సి వస్తుంది. అలా ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్స్ నిరూపించుకుంటున్నారు. 
 

26

అలా తామేంటో నిరూపించుకునేందుకు మరికొందరు స్టార్స్ ఇటీవల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న సుమ కానకాల కొడుకు రోషన్‌ కనకాల, అలాగే స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న సునీత కొడుకు ఆకాష్‌ ఇటీవలే తమ సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. తమ వారసులను ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లడంలో చాలా శ్రమించారు. వాళ్లే రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేశారు. చాలా రిస్క్ తీసుకున్నారు. 
 

36

సుమ కొడుకు రోషన్‌.. `బబుల్‌ గమ్‌` అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ట్రెండీ కంటెంట్‌తో, బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ వచ్చింది. `క్షణం` ఫేమ్‌ రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహించారు. ఇందులో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదలైంది. ఈ సినిమా కోసం అగ్రెసివ్‌గా ప్రమోషన్‌ చేశారు. ట్రెండీ కంటెంట్‌తో యూత్‌ని టార్గెట్‌ చేశారు. ఓవర్‌ డోల్‌ లిప్‌ లాక్‌లు, రొమాన్స్, ట్రెండీ డైలాగులు, కంటెంట్‌గా ఈ మూవీ వచ్చింది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో డిజప్పాయింట్‌ చేసింది. 

46

మరోవైపు సింగర్‌ సునీత కొడుకు ఆకాష్‌ గోపరాజు.. హీరోగా ఎంట్రీ ఇస్తూ `సర్కారు నౌకరి` అనే కంటెంట్‌ చిత్రంతో వచ్చారు. పీరియడ్‌ కథాంశంతో వచ్చింది. 1996లో ఎయిడ్స్ కారణంగా కొల్లాపూర్‌ అనే ప్రాంతం ఎలా ఇబ్బంది పడింది, అక్కడ ఓ వైద్య అధికారి ఎలాంటి మార్పు తీసుకొచ్చాడనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. శేఖర్‌ గంగనమోని దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దీన్ని నిర్మించడం విశేషం. సునీత ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆకాష్‌ కోసం ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా విడుదలైన ఈ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. ఓల్డ్ కంటెంట్‌, సీరియల్‌ తరహాలో సాగే కథనం ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇద్దరు సినిమాలు బోల్తా కొట్టాయి.
 

56

యాంకర్‌ సుమ తన కొడుకు కోసం ఎంతో కష్టపడింది. కానీ కంటెంట్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. సినిమాలో విషయం తప్ప బోల్డ్ కంటెంట్‌ ఎక్కువ అనే విమర్శలు వచ్చాయి. పైగా హీరోగా ఎంట్రీతోనే సినిమాలో యాటిట్యూడ్‌ చూపించడంతో అది ఓవర్‌గా అనిపించింది. ఆడియెన్స్ రిసీవ్‌ చేసుకోలేకపోయారు. దీంతో ఈ చిత్రం దారుణగా పరాజయం చెందింది. మొదటి రోజు తర్వాత దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సుమకి ప్రారంభంలోనే సన్‌ స్ట్రోక్‌ తగిలినంత పనైంది. కానీ రోషన్‌లో టాలెంట్‌ ఉంది. ఆయన మంచి కథలు ఎంచుకుని, సిన్సియర్‌గా చేస్తే క్లిక్‌ అయ్యే ఛాన్స్ ఉంది.
 

66

మరోవైపు సింగర్‌ సునీత కొడుకు చేసిన `సర్కారు నౌకరి` సినిమా అరిగిపోయిన కంటెంట్‌గా ఆడియె్న్స్ పట్టించుకోలేదు. పైగా పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్‌ అయ్యింది. దీంతో చాలా వరకు ఇది వచ్చిందా అనే విషయం తెలియకుండానే వెళ్లిపోయింది. కానీ సినిమాలో ఆకాష్‌ చాలా నేచురల్‌గా కనిపించాడు. యాక్టింగ్‌ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తే క్లిక్‌ అయ్యే అవకాశం ఉంది. ఇలా సునీతకి కూడా ఆకాష్‌ పై పెట్టుకుని ఆశలు గల్లంతయ్యాయి. తెరపై కొడుకుని చూసుకున్న ఆనందం ఉన్నా, సినిమా సక్సెస్ కాలేదనే బాధ ఎక్కువగా వెంటాడుతుంది. మరి భవిష్యత్‌లో మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలతో అలరిస్తారేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories