గుచ్చే చూపులతో కలవరపెడుతున్నశ్రీముఖి.. ట్రెడిషనల్ వేర్ లో బుల్లితెర రాములమ్మ అదిరిపోయే ఫోజులు..

First Published | Jul 2, 2023, 2:38 PM IST

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే డ్రెస్ లో కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర కుర్ర హృదయాలను దోచుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

యాంకర్ శ్రీముఖి టీవీ షోలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. స్టార్ యాంకర్ గా బుల్లితెరపై సందడి చేస్తోంది. తొలుత ‘పటాస్’ కామెడీషోతో ఈ ముద్దుగుమ్మ ఫేమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 
 

తొలిషోతోనే తన టాలెంట్ తో టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ మరింత క్రేజ్ దక్కించుకుంది.
 


నెట్టింట ఎప్పుడూ బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది శ్రీముఖి. ఇందుకోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ కుర్ర హృదయాలను దోచుకుంటోంది. 
 

ఇప్పటికే చాలా షోలకు ఈ ముద్దుగుమ్మ హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’తో అలరిస్తోంది. ఈ షోలో ఈరోజు మధ్యాహ్నం స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన లుక్ లో దర్శనమిచ్చింది.

రెడ్ గౌన్ లాంటి డ్రెస్ లో శ్రీముఖి అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లో బుల్లితెర రాములమ్మ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లుక్ తో పాటు కిర్రాక్ ఫోజులతో అదరగొట్టింది.
 

మరోవైపు మత్తు చూపులు, మత్తెక్కించే స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. శ్రీముఖి వరుసగా ట్రెడిషనల్ వేర్స్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ లుక్ కు కూడా ఫ్యాన్స్ తో పాటు అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

సమయం ఉన్నప్పుడల్లా శ్రీముఖి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్ చాట్ సెషన్స్ తోనూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ మరింతగా దగ్గరవుతోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ మంచి ఫాలోయింగే ఉంది.
 

కెరీర్ విషయానికొస్తే బుల్లితెరపై తిరుగులేకుండా దూసుకుపోతోంది. ఇక వెండితెరపైనా నటిగా అలరిస్తోంది.  ఇప్పటికే పలు చిత్రాల్లో మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - తమన్నా భాటియా జంటగా నటిస్తున్న ‘భోళా శంకర్’లో శ్రీముఖి కీలక పాత్రలో అలరించనుంది. 
 

Latest Videos

click me!