అయితే యాంకర్ రవి, అషురెడ్డి కలిసి హోస్టింగ్ చేస్తున్న టీవీ షో ‘హ్యాపీ డేస్’. ఈ షో వీరి జోష్.. పంచులు, అషుబోల్డ్ నెస్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది. అయితే ఈషోను కలిసి హోస్ట్ చేస్తున్నందున వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక కామెంట్లు చేసుకోవడం.. సరదాకి హార్ట్ చేసుకోవడం వంటివి వీరికి కామనే. ఆ ఫ్రెండ్ షిప్ తోనే రవి ఇలాంటి కామెంట్ చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు.