సుడిగాలి సుధీర్ ని ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదో బయటపెట్టిన యాంకర్ రష్మీ

First Published Oct 8, 2020, 12:26 PM IST

తాజాగా రష్మీ సుధీర్ ని ఎందుకు పెళ్లి చేసుకోవడంలేదో అసలు విషయాన్నీ బయటపెట్టింది. ఫన్నీగా సుధీర్ ని పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రమాదమేమిటో బహిరంగంగానే బయటపెట్టి అందరిని షాక్ కి గురిచేసింది.

బుల్లితెర మీద కనిపించే ఆన్ స్క్రీన్ జంటల్లో రష్మీసుధీర్ లది ప్రత్యేకమైన జోడి గా చెప్పవచ్చు. జబర్దస్త్ షో తో ప్రారంభమైన వీరి కాంబినేషన్ ఢీ షో కి కూడా పాకి, ఏకంగా వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తే ఎలాగుంటుందని ఈటీవీ ఒక ప్రోగ్రాం చేసేంత లెవెల్ లో వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. (Pic Credit Mallemala)
undefined
ఇక వీరికి సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నిసార్లు పెళ్లి చేసారో లెక్కలేదు. ప్రతిఒక్కరూ సుధీర్ రష్మీ జోడీపై కామెంట్లు చేయడం సర్వ సాధారణమైపోయింది. వెండితెరపై ప్రధాన్ అనుష్క జోడిల పెళ్లి పై ఎన్ని రూమర్లు వస్తుంటాయి.... బుల్లితెరపై వీరి పెళ్లి గురించి కూడా అన్నే రూమర్లు వస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
undefined
ఇకపోతే వీరిద్దరి పెళ్లి గురించిన రూమర్లు ఇద్దరిట్లో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటేనోకానీ ఆగేలా కనబడడం లేదు. ఇద్దరు కూడా ప్రస్తుతానికి తమ కెరీర్లలో బిజీగా ఉండడంతో బహుశా అటుగా కూడా ఆలోచించడంలేదు. చాలాసార్లు వీరిపైనా వచ్చిన రూమర్లకు వీరు క్లారిటీ ఇచ్చినప్పటికీ... అవి మాత్రం ఆగడం లేదు.(Pic Credit Mallemala)
undefined
తాజాగా రష్మీ సుధీర్ ని ఎందుకు పెళ్లి చేసుకోవడంలేదో అసలు విషయాన్నీ బయటపెట్టింది. ఫన్నీగా సుధీర్ ని పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రమాదమేమిటో బహిరంగంగానే బయటపెట్టి అందరిని షాక్ కి గురిచేసింది. ఢీ షో వేదికపై ఈ విషయాన్నీ రష్మీ చాలా హ్యూమర్ తో చెప్పినప్పటికీ... అందులో మాత్రం ఎంతోకొంత వాస్తవం లేకపోలేదు కూడా.(Pic Credit Mallemala)
undefined
నిన్న ప్రసారమైన ఢీ ఎపిసోడ్ లో మరోమారు పెళ్ళికి గురించిన డిస్కషన్ వచ్చింది. దీనితో సుధీర్ రష్మిని... పెళ్లి చేసుకో అని అన్నాడు. నేను గనుక పెళ్లి చేసుకుంటే, నీ బ్రతుకింక కర్చీఫులు, పావురాలు అని సుధీర్ ఇక మేజిక్ షోలు చేసుకోవాలని పంచ్ వేసింది.వెంటనే సుధీర్ అలా కాదు... మనమిద్దరం పెళ్లి చేసుకుందాము అనడంతో అప్పుడు ఇద్దరినీ ఎవరు చూడరు. ఇద్దరం ఇక కర్చీఫులు, పావురాలు పెట్టుకొని మేజిక్ షోలు చేసుకోవాలిసిందే అని ఫన్నీగా అనింది.(Pic Credit Mallemala)
undefined
వినడానికి ఫన్నీగా అనిపించినా... ఆన్ స్క్రీన్ పెయిర్ గా వీరికి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు మంచి టాలెంట్ ఉన్న నటులే అయినప్పటికీ... ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ వల్ల ప్రేక్షకులు వారి మధ్య నడిచే కెమిస్ట్రీని ఎంజాయ్చేస్తున్నారు.ఆ కెమిస్ట్రీ ఎంతలా పండకపోతే ఈటీవీ వారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నట్టుగా ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి పండగ స్పెషల్ గా టెలికాస్ట్ చేస్తారు చెప్పండి..! పెళ్ళయితే కెమిస్ట్రీ మిస్ అయి కెరీర్లు కూడా ప్రమాదంలో పడొచ్చని రష్మీ నవ్వుతూఅన్నప్పటికీ... దానిలో వాస్తవం కూడా లేకపోలేదు..!(Pic Credit Mallemala)
undefined
click me!