పింక్ గౌన్ లో రష్మీగౌతమ్ మెరుపులు.. టాప్ గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తున్న స్టార్ యాంకర్

First Published | Aug 3, 2023, 6:46 PM IST

యాంకర్, నటి రష్మీ గౌతమ్ తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.  ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ కట్టిపడేస్తోంది. 
 

‘జబర్దస్త్’ యాంకర్ గా రష్మీ గౌతమ్ (Rashmi Gautam)  టీవీ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితం. మరోవైపు నటిగానూ వెండితెరపై మెరుస్తూ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంటోంది. ప్రస్తుతానికి స్మాల్ స్క్రీన్ పై ఎక్కువగా సందడి చేస్తోంది. 
 

సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను, తను యాంకర్ గా వ్యహరిస్తున్న షో వివరాలను అందిస్తుంటుంది. అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తోంది. 
 


మరోవైపు రష్మీ గౌతమ్ బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను సైతం తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ స్టార్ యాంకర్ బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

లేటెస్ట్ లుక్ లో రష్మీ గౌతమ్ పింక్ గౌన్ లో మెరిసింది. పొట్టిగా ఉన్న గౌన్ లో ఈ ముద్దుగుమ్మ  స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మరోవైపు ముందుకు వంగి టాప్ గ్లామర్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఇలా వరుస పోస్టులు పెడుతూ వస్తున్న రష్మీ గౌతమ్ నయా లుక్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. కొన్ని సందర్భాల్లో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ యువత హార్ట్ బీట్ పెంచుతోంది. అలాగే నెటిజన్లు ఈ ముద్దుగమ్మను లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో అలరిస్తోంది. అలాగే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అటు ‘ఢీ’ డాన్స్ షోలోనూ రష్మీ కనిపించిన విషయం తెలిసిందే. ఇలా బుల్లితెరపై మాత్రం దూసుకెళ్తోంది. 
 

యాంకర్ గా వెలుగొందక ముందుకు రష్మీ గౌతమ్ కేరీర్ నటిగానే ప్రారంభమైంది. 2012లో వ్యాఖ్యాతగా మారిన ఈ ముద్దుగుమ్మ అంతకు ముందే పదికి పైగా సినిమాల్లోనే నటించింది. సపోర్టింగ్ రోల్స్ చేసి అలరించింది. యాంకర్ గా క్రేజ్ సంపాదించాక హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు అందుకుంది.
 

‘గుంటూరు టాకీస్’ చిత్రంతో హీరోయిన్ గా మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన ‘రాజుగారి బంగ్లా’, ‘అంతం’, ‘నెక్ట్స్ నువ్వే’ ‘అంతకు మించి’ వంటి సినిమాలతో మరింతగా అలరించింది.  ఇక చిన్న సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ వస్తోంది. ప్రస్తుతం చిరు ‘భోళా శంకర్’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Latest Videos

click me!