Rashmi Gautam: పిల్లలు పుట్టాలంటే మంచానికి.... బూతు కామెంట్స్ తో యాంకర్ రష్మీ గౌతమ్ రచ్చ 

Published : Feb 19, 2023, 08:37 PM ISTUpdated : Feb 19, 2023, 08:42 PM IST

యాంకర్ రష్మీ గౌతమ్ డబుల్ మీనింగ్ డైలాగ్ తో అందరికీ షాక్ ఇచ్చింది. పిల్లలు పుట్టాలంటే మంచానికి దగ్గరగా ఉండాలంటూ... దారుణ పంచ్ వేసింది. 

PREV
17
Rashmi Gautam: పిల్లలు పుట్టాలంటే మంచానికి.... బూతు కామెంట్స్ తో యాంకర్ రష్మీ గౌతమ్ రచ్చ 
Rashmi Gautam

ఒకప్పుడు జబర్దస్త్ స్కిట్స్ లో అడల్ట్ జోక్స్ బీభత్సంగా ఉండేవి. వాటిని ఒక వర్గం తెగ ఎంజాయ్ చేసేవారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని జోక్స్ వివాదాస్పదమయ్యాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కంటెంట్ విషయంలో మల్లెమాల సంస్థ పరిమితులు విధించింది. బూతు అర్థంతో కూడిన డబుల్ మీనింగ్ జోక్స్ వద్దని టీమ్ లీడర్స్ కి సూచించారు.

27
Rashmi Gautam

ఓ పరిధి మేరకు ఓకే, హద్దులు దాటొద్దని చెప్పడంతో షోలో బూతు జోక్స్ తగ్గిపోయాయి. ఈ మధ్య జబర్దస్త్ షో గతంలో మాదిరి ప్రభావం చూపడం లేదు. షోలో ఉన్నవారంతా కొత్త సరుకు. గత టీమ్ లీడర్స్ మాదిరి నాన్ స్టాప్ హాస్యం పంచలేకపోతున్నారు. ఈ క్రమంలో మరలా అడల్ట్ జోక్స్ ని జబర్దస్త్ మేకర్స్ నమ్ముకున్నారనిపిస్తుంది. 
 

37
Rashmi Gautam

కొన్ని ఎపిసోడ్స్ నుండి ఈ తరహా జోక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా యాంకర్ రష్మీ కొట్టిన పంచ్ డైలాగ్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. భార్యాభర్తల స్కిట్ లో... భర్త 'పిల్లలు పుట్టాలంటే ఇలా కంచానికి దగ్గరగా ఉంటే కుదరదే' అన్నాడు. భర్త పాత్ర చెప్పిన డైలాగ్ ని అందుకుంటూ రష్మీ 'మంచానికి దగ్గరగా ఉండాలి' అని గట్టిగా అరిచింది. 
 

47
Rashmi Gautam

పిల్లలు పుట్టడం, మంచం అంటూ బోల్డ్ పదాలు వాడారు. ఇక రష్మీ నోటి నుండి ఈ రేంజ్ బోల్డ్ జోక్స్ అంచనా వేయలేదని నెటిజన్స్ వాపోతున్నారు. టీఆర్పీ కోసం హద్దులు చెరిపేశారన్న సందేహం కలుగుతుంది. 
 

57
Rashmi Gautam


ఇక రష్మీ ఈటీవీతో పాటు మా టీవీలో కూడా చేస్తున్నారు. చాలా కాలం పాటు ఆమె మల్లెమాల, ఈటీవీ సంస్థలకే పరిమితమయ్యారు. ఇటీవల స్టార్ మా లో ప్రసారమైన కొత్త షోలో రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమా ఆఫర్స్ కూడా తగ్గిన నేపథ్యంలో ఆమె యాంకరింగ్ మీద మరింత దృష్టి పెట్టారు. 

67

అనసూయ మాత్రం యాంకరింగ్ వదిలేసి పూర్తిగా నటనకు అంకితమయ్యారు. రష్మీ పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. బోల్డ్ గ్లామరస్ రోల్స్ చేశారు. అయితే ఆమెకు బ్రేక్ ఇచ్చే ఒక్క హిట్ పడలేదు. దీంతో మేకర్స్ పక్కన పెట్టేశారు. గత ఏడాది బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్ తో ఒక చిత్రం విడుదలైంది. నందు హీరోగా విడుదలైన ఆ చిత్రం కూడా ఆడలేదు.

77

ఇక రష్మీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎవరిని చేసుకుంటారు? అనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. 34 ఏళ్ల రష్మీ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. బుల్లితెర స్టార్ సుధీర్ తో తనకున్న సంబంధం గురించి పూర్తి స్పష్టత ఇవ్వదు. అసలు ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా? అనేది ఎవరికీ తెలియదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories