హీరోయిన్‌గా అనసూయ.. దాగున్న రహస్యం బయటపెట్టిన నటుడు.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్‌ యాంకర్‌

Published : Jun 12, 2022, 03:57 PM IST

యాంకర్‌ అనసూయ వెండితెరపై నటనతో, బుల్లితెరపై అందాలతో ఆకట్టుకుంటుంది. అయితే ఆమె హీరోయిన్‌గానూ నటించింది. తాజాగా ఆ విషయం బయటపడింది.   

PREV
18
హీరోయిన్‌గా అనసూయ.. దాగున్న రహస్యం బయటపెట్టిన నటుడు.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్‌ యాంకర్‌

అనసూయ(Anasuya) గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని పంచుకున్నారు. ఇందులో ఆమె రవివర్మ గీసిన బొమ్మలా ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా హ్యాపీ సండే అంటే విషెస్‌ చెప్పింది అనసూయ. 
 

28

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్ లో అనసూయ అందం మరింత ఘాటు రేపేలా ఉండటం విశేషం. ఆమెలోని హాట్‌నెస్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.  ఫ్యాన్స్ ని కట్టిపడేస్తుంది.

38

అనసూయ అంటే ఆమె యాంకరింగ్‌ మాత్రమే గుర్తుకొస్తుంది. మరోవైపు రంగస్థలం తర్వాత ఆమె నటిగానూ పాపులారిటీని సొంతం చేసుకుంది. కీలక పాత్రలకు అనసూయ కేరాఫ్‌గా నిలుస్తుంది. బలమైన పాత్రలతోనే ఆకట్టుకుంటున్న ఈ భామ హీరోయిన్‌గా సినిమా చేసిందనే విషయం తాజాగా బయటకొచ్చింది. 

48

అనసూయ కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్‌ తరహా పాత్ర చేసింది. క్యూట్‌ అందాలతో కనువిందు చేసింది. తాజాగా ఈ విషయాన్ని నటుడు నందు వెల్లడించారు. వీరిద్దరు ఉన్న డ్యూయెట్‌ క్లిప్‌ ఆకట్టుకుంటుంది. అనసూయని నటుడు నందు టీజ్‌ చేస్తున్నట్టుగా ఉన్న వీడియోని నందు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. 
 

58

సోషల్‌ మీడియా ఛాటింగ్‌లో నందుని ఓ నెటిజన్లు `అనసూయ గురించి చెప్పండి` అని అడగ్గా, ఆమెతో ఉన్న ఓ సాంగ్‌ క్లిప్‌ని పంచుకున్నారు నందు. ఇందులో ప్రేమ గీతం పాడుతుంటారు నందు. అయితే ఆయన పాడేది అనసూయని ఉద్దేశించే కావడం విశేషం. 
 

68

ఇందులో నందు చెబుతూ, అఫీషియల్‌గా ఆన్‌ స్క్రీన్‌ నేనే అనసూయకి అని తెలిపారు. ఆమె సూపర్‌ ఉమెన్‌. ఆమె కెరీర్‌ని, జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తున్న తీరు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అయితే ఇది చూసిన అనసూయ.. నందుకి ధన్యవాదాలు చెబుతూ, నందు చెప్పింది నిజమని వెల్లడించడం విశేషం. అయితే ఈ సినిమాకి సంబంధించిన డిటెయిల్స్ తెలియాల్సి ఉంది. నందు మాత్రం ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.అయితే ఇది ఏ సినిమాకి సంబంధించిందనేది తెలియాల్సి ఉంది.  

78

ప్రస్తుతం అనసూయ `జబర్దస్త్` యాంకర్‌గా రాణిస్తుంది. ప్రారంభం నుంచి ఆమె ఈ షోని తనదైన గ్లామర్‌ తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రతి వారం ఈ షో కోసం అందంగా ముస్తాబై అందాల విందుని వడ్డిస్తుంది. ఇటీవల మరికొన్ని షోస్‌ పెంచింది అనసూయ. `సూపర్‌సింగర్‌ జూనియర్స్` కి యాంకర్‌గా చేస్తుంది. సుడిగాలిసుధీర్‌తో కలిసి హంగామా చేస్తుంది. 
 

88

మరోవైపు నటిగా వెండితెరపై క్షణం తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం ఆమె `దర్జా`, `పుష్ప 2`, `సింబా`, `వాండెట్‌ పండ్‌ గాడ్‌` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో నూ ఓ సినిమా చేస్తుంది అనసూయ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories