రష్మీ గొడవలో పచ్చి బూతులతో రెచ్చిపోయిన అనసూయ..ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ నెటిజన్ కి మాస్ కౌంటర్

Published : Jul 03, 2023, 07:48 AM IST

వివాదంలోకి ఓ నెటిజన్ అనవసరంగా బోల్డ్ యాంకర్ అనసూయని లాగాడు. ఏది ఏమైనా రష్మీ ఇలాంటి అంశాల గురించి ధైర్యంగా మాట్లాడుతుంది అని ప్రశంసిస్తూ అనసూయకి విమర్శించాడు.

PREV
17
రష్మీ గొడవలో పచ్చి బూతులతో రెచ్చిపోయిన అనసూయ..ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ నెటిజన్ కి మాస్ కౌంటర్

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. బుల్లితెరపై గ్లామర్ గా, కామెడీ పంచ్ లు వేస్తూ కనిపించే రష్మీ వేరు.. ఆఫ్ స్క్రీన్ లో రష్మీ వేరు.  ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.

27

జంతు హింస గురించి చిన్న సంఘటన జరిగినా రష్మీ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తుంది. అయితే తరచుగా రష్మీ ఇదే అంశంపై ఒక రేంజ్ లో ట్వీట్స్ వేస్తోంది. అయితే రష్మీ జంతు ప్రేమ కారణంగా తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. 

37

రష్మీ జంతుప్రేమ కారణంగా మే మతపరమైన వివాదాల్లో సైతం చిక్కుకోవడం చూస్తున్నాం. రష్మీ సోషల్ మీడియాలో నెటిజన్లతో ఆర్గుమెంట్ మొదలు పెట్టిందంటే అంత సులువుగా ఆపదు. తాజాగా రష్మీ నెటిజన్లతో మతపరమైన పంచాయతీ పెట్టుకుంది. అన్ని మతాలలో ఉన్న కుల వివక్ష గురించి రష్మీ ఆర్గుమెంట్ చేసింది. 

47
Anasuya

హిందూ మతంతో పాటు అన్ని మతాలలో హిందూ మతంలో ఉన్నట్లే క్యాస్ట్ డివిజన్స్ ఉన్నాయని పేర్కొంది. హిందూ మతంలో వెనుకబడిన సామజిక వర్గాలపై వివక్ష చూపుతుంటారు అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి రష్మీ బదులిస్తూ చాలా మంది హిందూ మతం నుంచి వేరే మతాలకు కన్వర్ట్ అవుతున్నారు. కానీ వారు హిందూ సంప్రదాయాలనే ఫాలో అవుతూ వేరే మతాల సర్టిఫికేట్ మాత్రం ఎందుకు వాడుకుంటున్నారు అని ప్రశ్నించింది. 

57

అయితే ఈ వివాదంలోకి ఓ నెటిజన్ అనవసరంగా బోల్డ్ యాంకర్ అనసూయని లాగాడు. ఏది ఏమైనా రష్మీ ఇలాంటి అంశాల గురించి ధైర్యంగా మాట్లాడుతుంది అని ప్రశంసిస్తూ అనసూయకి విమర్శించాడు. దీనితో అతడిపై రంగమ్మత్త రెచ్చిపోయింది. అలా ఇలా కాదు ఏకంగా పచ్చి బూతులతో సదరు నెటిజన్ కి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చింది. 

67

'హలో.. మిమ్మల్ని సరిచేయనీయండి. నాకు 'బాల్స్' లేవు. కానీ అవగాహన ఉన్న అంశాలపై ధైర్యంగా మాట్లాడేందుకు 'వజైనా' ఉంది. మనం అంతా కొన్ని అంశాలపై ఎవరి పర్పస్ కి తగ్గట్లుగా మాట్లాడతాం. ఎలాంటి విషయాలపై మాట్లాడాలి అనేది వారి వారి పర్సనల్ ఛాయిస్. మీరు మాట్లాడే అంశాలపై అందరూ స్పందించాలని అనుకోవడం మంచిది కాదు అంకుల్ ' అంటూ అనసూయ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. 

77

అనసూయ ఎంత ఘాటుగా రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. తన వరకు వస్తే అనసూయ ఎంత ఘాటుగా మాట్లాడుతుందో ఆల్రెడీ చూశాం. ఆంటీ అనే వివాదం విషయంలో తనని విమర్శించినా వారందరికీ గతంలో అనసూయ కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories