అమెరికాలో అనసూయ పక్కనే ఉన్న ఆ కొత్త వ్యక్తి ఎవరు? తల పీక్కుంటున్న నెటిజెన్స్!

Published : Oct 26, 2022, 11:32 AM IST

అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో ఓ వ్యక్తికి ఆమె బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఆమె కామెంట్స్ చూస్తే సదరు వ్యక్తి అనసూయకు చాలా క్లోజ్ అని అర్థం అవుతుంది. దీంతో ఆ వ్యక్తి ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. 

PREV
16
అమెరికాలో అనసూయ పక్కనే ఉన్న ఆ కొత్త వ్యక్తి ఎవరు? తల పీక్కుంటున్న నెటిజెన్స్!

అనసూయ అమెరికా అంటే అనకాపల్లికి వెళ్లినట్లు వెళ్లొస్తుంది. ఇటీవల తానా(TANA) వేడుకల కోసం అనసూయ అమెరికా వెళ్లారు. అక్కడి తెలుగు వాళ్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనసూయ తానా వేడుకలు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 

26
Anasuya Bharadwaj

ఆ ట్రిప్ ముగిసిన వెంటనే అనసూయ టెక్సాస్ లో ప్రత్యక్షమయ్యారు. అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన టెక్సాస్ లో అనసూయ హల్చల్ చేశారు.తన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అనసూయ మరలా టెక్సాస్ ఎప్పుడు వెళ్లారని ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. 
 

36


కాగా అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన ఓ ఫోటో సందేహాలకు దారితీసింది. ఆమె ఒక వ్యక్తి పక్కన నిల్చొని సెల్ఫీ దిగారు. అతని పేరు ఉజ్వల్ కస్టాల అని అనసూయ పోస్ట్ లో తెలియజేశారు. అమెరికాలో ఉజ్వల్ ని కలిసిన అనసూయ బర్త్ డే విషెస్ తెలియజేశారు. అతని బర్త్ డే వేడుకల్లో అనసూయ పాల్గొన్నట్లు తెలుస్తుంది. 

46


ఉజ్వల్ తో ఫోటో దిగిన తీరు, బర్త్ డే విషెస్ చెప్పిన తీరు చూస్తుంటే అనసూయకు అతడు చాలా క్లోజ్ అని అర్థం అవుతుంది. ఈ క్రమంలో ఉజ్వల్ ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టారు ఆమె అభిమానులు. ఉజ్వల్ ప్రొఫైల్ ప్రైవేట్ కావడంతో లాకై ఉంది. 
 

56
Anasuya Bharadwaj

గూగుల్ లో సెర్చ్ చేస్తే అతడి వివరాలు బయటకు వచ్చాయి. ప్రాధమికంగా ఉజ్వల్ నటుడని తెలుస్తుంది. అడివి శేష్ దర్శకత్వంలో 2013లో విడుదలైన 'కిస్' మూవీలో   ఉజ్వల్ నటించాడు. తర్వాత అతడు మరో మూవీ చేసినట్లు సమాచారం లేదు. బహుశా నటన ఉజ్వల్ ప్రైమ్ ప్రొఫెషన్ కాకపోవచ్చు. అతడు అమెరికాలో ఉండే అవకాశం కలదు. అనసూయకు ఫ్రెండ్ కావడంతో ఉజ్వల్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆమె పాల్గొని ఉండవచ్చు. 
 

66


మరోవైపు అనసూయ కెరీర్ సక్సెస్ ట్రాక్ లో పరుగులు పెడుతుంది. యాంకర్ గా కొనసాగుతూనే నటిగా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. అనసూయ నటించిన ఖిలాడి, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే  కొన్ని వెబ్ సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories