హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ

Published : Dec 17, 2025, 03:38 PM IST

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. `జబర్దస్త్` షో మానేసిన తర్వాత ఆమె క్రేజ్‌ తగ్గిపోయింది. ఈ క్రమంలో హీరోలపై ఆమె చేసిన కామెంట్‌ వైరల్‌ అవుతున్నాయి. 

PREV
16
ఆ వైభవాన్ని కోల్పోయిన అనసూయ

స్టార్‌ యాంకర్‌, నటి అనసూయ చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క మూవీనే ఉంది. అయితే ఆమె ఆచితూచి సినిమాలు చేస్తుందా లేక, అవకాశాలు తగ్గాయా? అనేది క్లారిటీ లేదుగానీ, అనసూయ ఎక్కువగా ఖాళీగానే ఉంటుంది. అడపాడదపా టీవీ షోస్‌లో మెరుస్తుంది. తన మనుగడని చాటుకుంటోంది. కాకపోతే జబర్దస్త్ షో టైమ్‌లో ఉన్న క్రేజ్‌ ఇప్పుడు లేదని చెప్పొచ్చు. అప్పుడు నిత్యం అనసూయకి సంబంధించి సోషల్‌ మీడియా చర్చ జరిగేది. ఆమెని కామెంట్‌ చేయడం, ట్రోల్‌ చేయడం, దానికి అనసూయ రియాక్డ్ కావడం, దీంతో నెట్టింట పెద్ద రచ్చ రచ్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ వైభవం లేదు. 

26
అనసూయని పట్టించుకోని ట్రోలర్స్

కానీ అప్పట్లో కొందరిపై అనసూయ పోలీస్‌ కంప్లెయింట్‌ చేసింది. జైల్లో పెట్టించింది. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో చాలా వరకు నెటిజన్లు తగ్గారు. ఆమెని ట్రోల్‌ చేయడం ఆపేశారు. అంతేకాదు ఇప్పుడు అసలు పట్టించుకోలేదు. అనసూయ గ్లామర్‌ ఫోటోలు పెట్టినా, పెద్దగా రియాక్షన్‌ లేదు. అది ఆమె క్రేజ్‌ తగ్గిందని చెప్పడానికి నిదర్శమంటున్నారు. అనసూయ కూడా కాస్త హుందాగా వ్యవహరిస్తోంది.

36
హీరోలపై అనసూయ క్రేజీ కామెంట్‌

ఇదిలా ఉంటే అనసూయ హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. దాదాపు 12ఏళ్ల క్రితం నాటి విషయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెబుతూ, హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని, అందుకే తాను అప్పట్లో హీరోలను అవాయిడ్‌ చేసినట్టు చెప్పింది అనసూయ. హీరోలపై తాను మరో రకమైన ఒపీనియన్‌తో ఉన్నట్టు చెప్పింది. ఆ తర్వాత తాను చేసిన తప్పుని తెలుసుకుని రియలైజ్‌ అయ్యిందట.

46
అడవిశేషుని అవాయిడ్ చేసిన అనసూయ

అనసూయ చెబుతూ, `నేను దేవిశ్రీ ప్రసాద్ అమెరికా టూర్‌ చేశాము. ఆ టైమ్‌లో అడవి శేష్‌ నన్ను అప్రోచ్‌ అయ్యాడు. హీరోలు అందరు లైన్‌ వేయడానికి అప్రోచ్‌ అవుతారు అనుకొని ఆయన్ని నేను తెగ అవాయిడ్‌ చేసేదాన్ని` అని తెలిపింది అనసూయ. హీరోలపై ఉన్న తప్పుడు ప్రచారం నేపథ్యంలో తాను ఇలాంటి తప్పు చేసినట్టు అనసూయ పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. అడవి శేషు హీరోగా రూపొందిన `క్షణం` మూవీలో అనసూయ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇది 2016లో విడుదలై విజయం సాధించింది.

56
అడవి శేషుని అనసూయ అందుకే పట్టించుకోలేదా?

అయితే 2013 టైమ్‌లో అడవి శేషు ఒకటి అర సినిమాలతో రాణిస్తున్నారు. క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అలాంటి టైమ్‌లో అనసూయ ఆయన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆయన ఒక హీరోగా, ఆల్మోస్ట్ స్టార్‌గా రాణిస్తుండటం విశేషం. ప్రస్తుతం అడవి శేషు `డెకాయిట్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

66
జబర్దస్త్ షోతో పాపులర్‌ అయిన అనసూయ

అనసూయ టీవీ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది. కొన్ని సినిమాలు చేసింది. కానీ గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌ గా చేసే అవకాశం ఉంది. దీంతో పాపులర్‌ అయిపోయింది. స్టార్‌ యాంకర్‌గా వెలిగింది. సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. కొన్నేళ్లపాటు ఇంటర్నెట్‌ని రూల్‌ చేసింది. ఇప్పుడు జబర్దస్త్ షోకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు, తనపై వేసే పంచ్‌లు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి, అవి తన పిల్లలకు అర్థం అవుతాయని చెప్పి షోని వదిలేసినట్టు తెలిపింది అనసూయ. ప్రస్తుతం సినిమాలకే పరిమితమయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories