అలాగే అనసూయ రెండు రోజుల క్రితం ఒక వీడియో బైట్ విడుదల చేశారు. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ మీద ఆమె మండిపడ్డారు. సెలబ్రిటీల మీద వార్తలు రాసి కడుపు నింపుకునే మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటుంటే నిజాలు రాయండి. నేను నిజం మాట్లాడాను . నా అభిప్రాయం తెలియజేశాను. ఫలానా హీరో ఫ్యాన్స్ అనసూయను వేధించారు, ట్రోల్ చేశారు, వెంటబడ్డారు ఇది కాదు. ఇంకా మీకు దునియా దారి అర్థం కావడం లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అన్నవాడి నోరే కంపు. చేతకాని వాళ్ళు అదుపు తప్పారు. ఇది మీరు పెట్టాల్సిన థంబ్ నెయిల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం, అంటూ వీడియో ఎండ్ చేశారు.