అప్పట్లో రూ. 500 కోసం ఆ పని చేసిన అనసూయ... ఎవరికీ తెలియని ఈ రహస్యం మీకు తెలుసా?

Published : May 10, 2024, 03:31 PM IST

అనసూయ భరద్వాజ్ అంటే తెలియనివారుండరు. ఆమె ప్రస్తుతం బిజీ యాక్ట్రెస్. కోట్లు సంపాదిస్తున్న అనసూయ కేవలం రూ. 500 కోసం ఏం చేశారో తెలిస్తే విస్తుపోతారు.   

PREV
16
అప్పట్లో రూ. 500 కోసం ఆ పని చేసిన అనసూయ... ఎవరికీ తెలియని ఈ రహస్యం మీకు తెలుసా?
Anasuya Bharadwaj

టాలీవుడ్ క్రేజీ యాక్ట్రెస్ గా ఉంది అనసూయ. జబర్దస్త్ వేదికగా ఆమెకు పాపులారిటీ దక్కింది. 2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ షో సక్సెస్ లో అనసూయ పాత్ర ఎంతగానో ఉంది. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. 
 

26
Anasuya Bharadwaj

పొట్టిబట్టల్లో అనసూయ స్కిన్ షో చేయడం పై విమర్శలు తలెత్తాయి. ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ వెనక్కి తగ్గలేదు. కెరీర్ కోసం తప్పదని ఆమె ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో నటిగా మారింది. ఆమె కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. 

 

36

కాగా అనసూయ కెరీర్ మొదలైంది నటిగానే. చదువుకునే రోజుల్లోనే ఆమె నటిగా ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో అనసూయకు ఓ చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. 2003లో ఎన్టీఆర్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కింది. సదా హీరోయిన్ గా నటించింది. 

46
Anasuya Bharadwaj


ఈ మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా అనసూయ నటించడం విశేషం. అయితే ఆమెకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే ఆయన వెనుక అనసూయ కనిపిస్తుంది. ఈ పాత్ర చేసే నాటికి అనసూయ వయసు కేవలం 19 ఏళ్ళు అట. ఆమె జూనియర్ కాలేజీలో ఉన్నారట. 
 

56


నాగ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన అనసూయకు రూ. 500 చెల్లించారట. అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఆ రోజుల్లో ఇచ్చే పేమెంట్ అన్నమాట. ఇప్పుడు అనసూయ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సంపాదన రోజుకు లక్షల్లో ఉంటుంది. 


 

66

ఆర్థికంగా అనసూయ నిలదొక్కుకుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ స్వశక్తితో ఎదిగింది. ఆమెకు హైదరాబాద్ లో విలాసవంతమైన ఇల్లు ఉంది. లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories