చీరకట్టులో అనసూయ మాస్ లుక్.. ‘దర్జా’ నుంచి అందాల యాంకర్ అదిరిపోయే పిక్స్..

Published : Jul 22, 2022, 01:10 PM IST

అందాల యాంకర్ అనసూయ లేటెస్ట్ గా ‘దర్జా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ లోకేషన్ లో అనసూయకు సంబంధించిన కొన్ని పిక్స్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది.   

PREV
16
చీరకట్టులో అనసూయ మాస్ లుక్.. ‘దర్జా’ నుంచి అందాల యాంకర్ అదిరిపోయే పిక్స్..

బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ (Anchor Anasuya) వెండితెరపై విభిన్న పాత్రలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ’లో దాక్షాయణిగా అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

26

లేడీ ఓరియెంట్ ఫిల్మ్, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దర్జా’ (Darja). ఈ చిత్రం ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కనక మహాలక్ష్మి పాత్రను పోషించింది. దర్శకుడు సలీమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం క్రేజీ అప్డేట్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. 

36

మాస్ క్యారెక్టర్ లో ఆడియెన్స్ ను అలరించేందుకు అనసూయ సిద్ధమైంది. ఈ చిత్రంతో అనసూయ మరోసారి  నెగిటివ్ రోల్ ప్లే చేయడం ప్రేక్షకుల్లో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ పాపులర్ నటిగా మారిన అనసూయ ఇటు సోషల్ మీడియాలోనూ తన పాపులారిటీని పెంచుకుంటోంది.
 

46

తాజాగా ‘దర్జా’ మూవీకి సంబంధించిన సినిమా సెట్ నుంచి అనసూయ కొన్ని ఫొటోలను, వీడియోలను తన అభిమానులతో పంచుకుంది. కనక మహాలక్ష్మి పాత్ర తాలుకూ ఆహార్యం అనసూయ అదరిపోయింది. చీరకట్టులో మాస్ లుక్ ను సొంతం చేసుకుంది. ఎంత మాస్ గా ఉన్నా.. గ్లామర్ షో ఏమాత్రం తగ్గలేదని  అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 

56

స్మాల్ స్క్రీన్ బ్యూటీగా అందాలు ఆరబోసిన అనసూయ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. అందాల విందులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. టాలీవుడ్ లో కీలక పాత్రల కోసం ప్రస్తుతం దర్శక నిర్మాతలు అనసూయ వైపు చూడటం విశేషం. 

66

రామ్ చరణ్ (Ram Charan)నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్  ‘రంగస్థలం’తో రంగమ్మత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. ఆ తర్వాత పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది. అలాగే సూపర్ సింగర్ రియాలిటీ షోకూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ‘వాంటెండ్ పండుగాడ్, సింబా, పుష్ఫ : ది రూల్, రంగ మార్తండా’ సినిమాల్లోనూ అనసూయ కీలక పాత్రలు పోషిస్తోంది.
 

click me!

Recommended Stories