నీ పెంపకంపై అనుమానం వస్తోంది.. 'ఆంటీ' కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 17, 2022, 06:26 PM IST

అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

PREV
16
నీ పెంపకంపై అనుమానం వస్తోంది.. 'ఆంటీ' కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం

అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

26

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అనసూయపై ట్రోలింగ్ కొత్తేమి కాదు. నెటిజన్ల నుంచి అనసూయ తరచుగా విమర్శలు, కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటుంది. అనసూయ తరచుగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెపై కొందరు నెటిజన్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. 

 

36

తాజాగా అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో.. ఓ నెటిజన్ అనసూయని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవాలా లేక అక్క అని పిలవాలా అని అడిగాడు. అతడి ఉద్దేశం అర్థం చేసుకున్న అనసూయ ఘాటుగా బదులిచ్చింది. 

46

అసలు ఎలాగూ పిలవద్దు. నువ్వు అలా పిలవడానికి నేనెవరో  అంతగా తెలియదు. మన మధ్య చనువు లేదు అని చెప్పింది. పైగా నువ్వు చెప్పింది ఏజ్ షేమింగ్ కిందికి వస్తుంది. మీ పెంపకంపైనే నాకు అనుమానంగా ఉంది అంటూ అనసూయ సదరు నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసింది. 

56

అయితే అనసూయ సమాధానంపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా స్వీకరించవద్దు అని అనసూయకి సూచించారు. దీనికి అనసూయ బదులిస్తూ.. అది ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు.. కానీ నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి అని అనసూయ బదులిచ్చింది. 

66

ఇక కాంప్లిమెంట్స్ తీసుకోవాలా వద్దా అనేది నాకు సంబందించిన విషయం అని అనసూయ పేర్కొంది. తాను గతంలో లాగా కాదని.. ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయినట్లు అనసూయ పేర్కొంది. తనపై ట్రోలింగ్ పెరిగేకొద్దీ తాను, తన ఫ్యామిలీ మరింత స్ట్రాంగ్ గా మారినట్లు అనసూయ తెలిపింది. 

click me!

Recommended Stories