50 ఏళ్లలోనూ కత్తిలా అనసూయ.. `జబర్దస్త్` యాంకర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారంటే?

Published : May 15, 2022, 03:36 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయకి సోషల్‌ మీడియాలో, టీవీరంగంలో ఉన్న ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గూగుల్‌లో మాత్రం ఆమె గురించి ఎక్కువగా సెర్చ్ చేసిందేంటో బయటపడింది. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.   

PREV
16
50 ఏళ్లలోనూ కత్తిలా అనసూయ.. `జబర్దస్త్` యాంకర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారంటే?

`జబర్దస్త్` షోకి యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది అనసూయ(Anasuya). ఆమె అడపాదడపా సినిమాల్లో నటించినా, `జబర్దస్త్`(Jabardasth Anasuya) ఆమెకి లైఫ్‌ ఇచ్చింది. క్రేజ్‌ని, ఇమేజ్‌ని తీసుకొచ్చింది. టీవీ రంగంలో అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న యాంకర్‌ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ అనే చెప్పాలి. యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఆమె సొంతం. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. 
 

26

యాంకర్‌ అనసూయ నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఆమె బర్త్ డే (Anasuya Birthday)సందర్భంగా ప్రస్తుతం అనసూయ నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేస్తూ ఆమెకి బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా రూపొందుతున్న `మైఖేల్‌` చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుండగా, యూనిట్‌ ఆమెకి విషెస్‌ తెలిపింది. మరోవైపు `సింబా` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `వాంటెడ్‌ పండుగాడ్‌` సినిమా చేస్తుంది. దీనికి కె.రాఘవేంద్రరావు సమర్పకులు కావడం విశేషం. 

36

వీటితోపాటు గోపీచంద్‌ `పక్కా కమర్షియల్‌`, బన్నీ నటిస్తున్న `పుష్ప 2`, అలాగే కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ`లో కీలక పాత్రలు పోషిస్తుంది. టీవీలో గ్లామర్‌తో కనువిందు చేసే ఈ భామ పెద్ద తెరపై మాత్రం నటిగా నిరూపించుకుంటానని, నటిగా తన సత్తాని చాటుకుంటానని తెలియజేసింది. ఆమె అలాంటి బలమైన పాత్రల్లోనే నటిస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది అనసూయ. అలాగే మలయాళంలో మమ్ముట్టితో నటించిన `భీష్మపర్వం` విడుదలైంది. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

46

ఇదిలా ఉంటే టీవీ షోస్‌లో ఆమె `జబర్దస్త్` కి యాంకర్‌గా చేస్తుంది. ఈ షో స్టార్టింగ్‌ నుంచి అనసూయ యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అందులో గ్లామర్‌గా ముస్తాబై, కనువిందు చేస్తుంది. కమెడీయన్ల పంచ్‌లను ఎంజాయ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే ఇటీవల కొత్తగా ప్రారంభమైన `ది సూపర్‌ ఫ్యామిలీ` షోలోనూ సందడి చేస్తుంది అనసూయ. అందులో టీమ్‌ లీడర్‌గా కనిపిస్తుండటం విశేషం. 

56

ఇదిలా ఉంటే లేటెస్ట్ `ది సూపర్‌ ఫ్యామిలీ` షోలో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది అనసూయ. ఈ హాట్‌ యాంకర్‌ బర్త్ డే సందర్బంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో అనసూయకి సంబంధించిన విషయాలను రివీల్‌ చేశారు. గూగుల్‌లో అనసూయ గురించి ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలను బయటపెట్టారు ఈ షో యాంకర్‌ ప్రదీప్‌. ఇందులో ఎక్కువగా అనసూయ ఏజ్‌ గురించి సెర్చ్ చేశారట. ఇది రెండో స్థానంలో ఉండగా, ఆమె ఫోన్‌ నెంబర్‌ గురించి సెర్చ్ చేయడం మొదటి స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో మాత్రం అనసూయ అసలు పేరు ఏంటి? అని, నాల్గో స్థానంలో అనసూయ ఇంటి అడ్రెస్‌ గురించి సెర్చ్ చేసినట్టు చెప్పారు ప్రదీప్‌. 
 

66

అయితే మొదట తన ఏజ్‌గురించి చెప్పిన అనసూయ తన వయసుని చెప్పేందుకు నిరాకరించింది. తప్పించుకునే ప్రయత్నం చేసింది. యాభై ఏళ్లు వచ్చినా అనసూయ కత్తిలా ఉందనుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పి షాకిచ్చింది. ఇంతటి బోల్డ్ స్టేజ్‌మెంట్‌తో అంతా షాక్‌ అయ్యారు. కాస్త గ్యాప్‌ ఇచ్చి అసలు విషయం చెప్పింది. తాను ఈ పుట్టిన రోజుతో 37ఏళ్లు పూర్తి చేసుకుని 38ఏళ్లలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది `జబర్దస్త్` యాంకర్‌. మరోవైపు ఇంటి అడ్రెస్‌ ప్రశ్నకి, గూగుల్‌లో అనసూయ హౌజ్‌ అని టైప్‌ చేసి సెర్చ్ చేస్తే మ్యాప్‌లో తన ఇంటిని చూపిస్తుందని చెప్పింది. దీనికి ప్రదీప్‌ స్పందిస్తూ మీరు పెద్ద హింట్‌ ఇచ్చేశారని అనగా, నాలుక కర్చుకున్న అనసూయ, దీన్ని కట్‌ చేయండంటూ చెప్పడం నవ్వులు పూయించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories