టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.
గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ ఫొటోలతో పాటు ఫ్యామిలీ విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల అనసూయ తన భర్త పిల్లల్తో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. అయితే తాజాగా అనసూయ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.
తన చిన్ననాటి రేర్ ఫోటోని అభిమానులతో పంచుకుంది. 24 ఏళ్ళ క్రితం ఫోటో అది. అంటే అనసూయ 14 ఏళ్ల వయసులో స్కూల్ ఏజ్ లో ఉన్నపటి పిక్. తన స్కూల్ తరుపున ఎన్ సి సి లీడర్ గా అనసూయ ఢిల్లీకి వెళ్లిందట. 2000 సంవత్సరంలో ఇది జరిగింది.
తన ఎన్ సి సి టీంకి అనసూయ జూనియర్ వింగ్ కాంటిజెంట్ కమాండర్ గా ఉండేదట. ఎన్ సి సి యూనిఫామ్ లో ఢిల్లీలో సెల్యూట్ కొడుతున్న పిక్ ని అనసూయ పంచుకుంది. ఫోటో క్లారిటీ లేనప్పటికీ అనసూయ బాగానే కనిపిస్తోంది. తన అందంగా గురించి మాట్లాడుతూ నాట్ బాడ్ బాగానే ఉన్నాను కదా అని కామెంట్ పెట్టింది. మరో పిక్ లో ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత ఇలా ఉన్నా అని పేర్కొంది.
ఈ ఫోటో చూస్తున్న ఫ్యాన్స్ అనసూయని గుర్తు పట్టడం కష్టమే అని అంటున్నారు. కానీ చిన్నతనంలో అనసూయ బాగా సన్నగా ఉన్నట్లు ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ లో హాటెస్ట్ యాంకర్ గా మారింది.