పవన్‌ విషయంలో రియలైజైన అనసూయ.. వైష్ణవ్‌ తేజ్‌తో క్రష్‌ ఏర్పడిందటః హాట్‌ యాంకర్‌ సంచలన వ్యాఖ్యలు

Published : May 10, 2021, 10:49 AM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ విషయంలో తాను రియలైజ్‌ అయినట్టు చెప్పారు. ఆయనతో చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. అంతేకాదు వైష్ణవ్‌ తేజ్‌పై క్రష్‌ ఏర్పడిందట.   

PREV
110
పవన్‌ విషయంలో రియలైజైన అనసూయ.. వైష్ణవ్‌ తేజ్‌తో క్రష్‌ ఏర్పడిందటః హాట్‌ యాంకర్‌ సంచలన వ్యాఖ్యలు
`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ ఇప్పుడు వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. భారీ ఆఫర్స్ దక్కించుకుంటూ తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తుంది. మదర్స్ డే సందర్భంగా ఆమె ఓ టీవీ ఛానెల్‌(టీవీ9)లో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర, షాకింగ్‌ విషయాలను, సంచలన విషయాలను వెల్లడించింది.

210
ఒకప్పుడు మూడు నాలుగు టీవీ షోస్‌చేసేదాన్ని అని, ఇప్పుడు `జబర్దస్త్ ` ఒక్కటే చేస్తున్నానని తెలిపింది. అవకాశాలు పోయాయని పేర్కొంది. దీంతో సినిమాలపై ఫోకస్‌ పెట్టినట్టు తెలిపింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ టీవీ షో, సినిమాలు చేస్తున్నానని పేర్కొంది అనసూయ.

310
ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తానని, అది `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్రని మరిపిస్తుందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పలేనని, విడుదలయ్యాక ఆడియెన్స్ నిర్ణయిస్తారని పేర్కొంది. `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్ర కూడా అంతగా పండుతుందని, అంతటి పేరొస్తుందని ఎవరం ఊహించలేదని తెలిపింది. `పుష్ప`లో తన పాత్ర కచ్చితంగా మంచి ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది.

410
కృష్ణవంశీతో `రంగమార్తాండ` చిత్రంలో తనది మంచి ప్రయారిటీ ఉన్న రోల్‌ అని, ఆయన సినిమాల్లో ఆడవాళ్లని బాగా చూపిస్తారని తన పాత్ర కూడా నిండుగా ఉంటుందని చెప్పింది. ఇక `ఖిలాడి`లో నెవర్‌ బిఫోర్‌ అవతార్‌లో తనని చూడొచ్చని పేర్కొంది.

510
తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేశానని, చాలా ధైర్యం చేసిన ఆ పాత్ర చేశానని తెలిపింది. మలయాళంలో మమ్ముట్టితో నటిస్తున్నానని చెప్పింది. ఇది తన డ్రీమ్‌ లాంటి ప్రాజెక్ట్ అని, చాలా గర్వంగా ఉందని పేర్కొంది.

610
ఇక తెలుగులో సినిమాలు విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ ఎవరితో చేయాలనుకుంటున్నారని యాంకర్‌ అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ కచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌తో అని పేర్కొంది. గతంలో నేను వేరు, ఇప్పుడు వేరు అని, అలాగని తాను మారలేదని, తన ఛాయిస్‌ మారిందని చెప్పింది. ఆయన ఫ్యాన్స్ రెస్పాన్సిబుల్‌గా ఉంటే బాగుండేదని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి రాదని చెప్పింది.

710
చిరంజీవితో ఎక్కువ స్క్ర్రీన్‌ చేసుకునే పాత్ర చేయాలని ఉందని పేర్కొంది. పవన్‌, చిరుతో చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పేసింది అనసూయ. అంతేకాదు వైష్ణవ్‌ తేజ్‌పై క్రష్‌ ఏర్పడిందట. `ఉప్పెన` సినిమా చూశాక వైష్ణవ్‌పై క్రష్‌ ఏర్పడిందని, ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉందని తెలిపింది.

810
ఇటీవల ఒకటి రెండు భారీ సినిమాలో ఆఫర్‌ మిస్‌ అయ్యాయని చెప్పింది అనసూయ. కొన్ని రీజన్స్ తో అవి చేయలేకపోయానని తెలిపింది. ఎథికల్‌గా,ప్రొఫేషనల్‌గా అవి చేయడం రైట్‌ కాదనిపించిందని, దీంతో అవి మిస్‌ అయ్యాయనని తెలిపింది. వారి పేర్లు మెన్షన్‌ చేయలేనని తెలిపింది.

910
ఒకప్పుడు కొందరికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉండేదని, ఆవేశంతో, ఉడుకు రక్తంతో ఇది,అది చేయాలని ఉండేదని, ఇప్పటికీ ఉందని, కానీ ఆ విషయాలు చెప్పలేనని పేర్కొంది అనసూయ.

1010
ఇటీవల ఆమె మెయిన్‌ లీడ్‌గా నటించిన `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా `ఆహా` ఓటీటీలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ ని దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనసూయ సంతోషం వ్యక్తం చేసింది. అలాగే కరోనా వేళ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories