హాట్ యాంకర్ అనసూయ.. టీవీ షోలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఏడాదిపైనే అవుతుంది ఆమె టీవీకి గుడ్ బై చెప్పి. కానీ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేసింది.
అనసూయ(Anasuya Bharadwaj). ఈ ఆదివారం టీవీ షోలో మెరిసింది. ఆమె డాన్సులతో పర్‌ఫెర్మ్ చేసింది. ఓల్డ్ సాంగ్‌లకు అదిరిపోయే డాన్సులు చేసి కేకపెట్టించింది. ఆమె చేసిన రచ్చ, సందడి మామూలు కాదు. ఇన్నాళ్లు మిస్ అయ్యిందంతా ఒకేసారి ఇచ్చేసింది అనసూయ.
28
photo credit anasuya instagram
`జీ తెలుగు కుటుంబం అవార్డ్స్` వేడుకలో పాల్గొంది అనసూయ ఇందులో ఆమె. పలు ఓల్డ్ సాంగ్‌లకు డాన్సులు చేసింది. చీరకట్టులో ఆమె చేసిన డాన్సులు ఆడియెన్స్ ని ఉర్రూతలూగించాయి. అయితే దీనికి సంబంధించిన పిక్స్ ని పంచుకుంటూ అలరిస్తుంది.
38
photo credit anasuya instagram
ఈ భామ తన గ్లామర్ పిక్స్ ని పంచుకుంది. డాన్స్ పర్‌ఫెర్మెన్స్ లో తీసిన పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. ఎర్ర చీరలో గుంటూరు మిర్చీని తలపిస్తుంది అనసూయ. పూల తోటలో ఆమె ఇచ్చిన పోజులు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.
48
photo credit anasuya instagram
అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ యాంకర్‌గా రాణించిన విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లు చేసిన ఆమె గతేడాది గుడ్ బై చెప్పింది. తన పిల్లలు పెద్ద అవుతున్నారు, అన్నీ వారికి అర్థం అవుతున్నాయని చెప్పి, ఈ షో నుంచి తప్పుకుంది అనసూయ.
58
photo credit anasuya instagram
ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. బలమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. ఇటీవల ఆమె `ప్రేమ విమానం`, `పెదకాపు1`, `విమానం`, `రంగమార్తాండ` వంటి చిత్రాల్లో నటించింది. స్ట్రాంగ్ రోల్స్ తో మెప్పించింది.
68
photo credit anasuya instagram
ఈ క్రమంలో ఆ మధ్య ఓ హింట్ ఇచ్చింది అనసూయ. మళ్లీ తాను బుల్లితెరపై సందడి చేయబోతున్నట్టు తెలిసింది. తాను టీవీ కి రావాలని ఎంత మంది రావాలని కోరుకుంటున్నారని, అలాగే ఏ షో చేయాలని కోరుకుంటున్నారని పోల్ నిర్వహించింది.
78
అనసూయని బుల్లితెరపైకి రావాలని 70శాతానికిపైగానే ఆడియెన్స్ కోరుకుంటున్నారు. అదే సమయంలో జబర్దస్త్ షో చేయాలని కోరుకోవడం విశేషం. దీంతో మొదటి దానికి హ్యాపీ అయిన అనసూయ, రెండో దానికి మాత్రం తలపట్టుకుంది. ఇంకా జబర్దస్త్ ని కోరుకోవడమనేది ఆమెకి నచ్చలేదు.
88
అయితే ఆమె ఓ కొత్త షోతో రాబోతున్నట్టు చెప్పింది. కానీ `జీ తెలుగు కుటుంబం అవార్డ్స్` తో సందడి చేయడం విశేషం. అయితే ఇది శాంపుల్ మాత్రమే అట, మున్ముందు ఇంకా ఉందని తెలుస్తుంది. ఆమె టీవీ షోలో యాంకర్‌గా చేయడానికి కూడా ప్లాన్ చేస్తుందని, మహిళలకు సంబంధించిన షోని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అనసూయ మళ్లీ టీవీలో సందడి చేయబోతుందనే వార్తతో మాత్రం ఆమె అభిమానులు హ్యాపీ అవుతున్నారు.