ప్యాంట్ లేకుండా తిరిగేస్తోంది, అనసూయ స్టయిలే వేరు.. చూడ ముచ్చటగా ఉన్న ఫోజులు వైరల్

First Published | Jan 29, 2024, 1:44 PM IST

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. 

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.

గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 


అనసూయకి ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. గత ఏడాది అనసూయ పలు వివాదాస్పద సంఘటనలతో ట్రోలింగ్ ఎదుర్కొంది. అందులో ఆంటీ అంశం ఒకటైతే మరొకరి విజయ్ దేవరకొండ అంశం. 

విజయ్ దేవరకొండని అనసూయ ఎప్పుడూ గిల్లుతూ పరోక్షంగా పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో అనసూయని టార్గెట్ చేశారు. ఇక అనసూయని బాధపెట్టిన మరో అంశం నెటిజన్లు ఆమెని టార్గెట్ చేసి మరీ ఆంటీ అని పిలవడం. ఆంటీ అంటూ అనసూయపై పోస్ట్ లు పెట్టారు. 

దీనిని కూడా అనసూయ తీవ్రంగా ప్రతిఘటించింది. పలు వేదికలపై తనని ఆంటీ అనొద్దని వార్నింగ్ ఇచ్చింది. తాను చిన్న పిల్లలకు ఆంటీ అవుతాను కానీ సోషల్ మీడియాలో ఉన్నవారికి ఎలా ఆంటీ అవుతాను అంటూ ప్రశ్నించింది. 

ఈ ట్రోలింగ్ మొత్తం అనసూయకి చేదు అనుభవాలు మిగిలిచినట్లు అనిపిస్తోంది. ఇకపై ట్రోలర్స్ కి దూరంగా ఉంటా అని అనసూయ తెలిపింది. కొత్త ఏడాది ఈ నిర్ణయం తీసుకుంది అనసూయ. 

ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో  ముచ్చటిస్తూ ట్రోలర్స్ పై తన అభిప్రాయం చెప్పింది. ట్రోలర్స్ అంటే వికారమైన జీవులు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళకి ఏదో ఒకటి చెబుతూ ఇకపై టైం వేస్ట్ చేసుకోను అని తెలిపింది. 

గత ఏడాది అనసూయకి, విజయ్ దేవరకొండ అభిమానులకు పెద్ద యుద్ధమే జరిగింది. అనసూయ విజయ్ దేవరకొండని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం.. తిరిగి విజయ్ ఫ్యాన్స్ అనసూయని ట్రోల్ చేయడం జరుగుతూ వచ్చింది. ఇకపై ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటానని అనసూయ పేర్కొంది.

కొత్త ఏడాది అనసూయ తన భర్త ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.  ఈ ఏడాది ఫస్ట్ వెకేషన్ అంటూ అనసూయ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

తాజాగా అనసూయ స్కై బ్లూ కలర్ గౌన్ లో మెరుపులు మెరిపించింది. అల్లరి చేష్టలు చేస్తూ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. అయితే అనసూయ గౌన్ వేసుకుంది కానీ ప్యాంట్ వేసుకోలేదు. ఈ ఫోజులకు యువత వెర్రెత్తిపోతున్నారు. అనసూయ థండర్ థైస్ కుర్రాళ్ళకి కనువిందుగా మారాయి. 

Latest Videos

click me!