Anasuya: యాంకర్ అనసూయ ఇటీవల ఆడవాళ్లు, హీరోయిన్ల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీని ఒక రేంజ్‌లో ఆడుకున్న విషయం తెలిసిందే. అయితే తన బట్టలపై సొంత కొడుకే కామెంట్ చేశాడట.
ఇటీవల టాలీవుడ్ లో హీరోయిన్ల బట్టలపై వివాదం నడిచిన విషయం తెలిసిందే. నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. దీనిపై చాలా మంది స్టార్ హీరోయిన్లు, ఇతర నటీమణులు స్పందించారు. ఇక అనసూయ అయితే రెచ్చిపోయింది. ఇదే ఛాన్స్ అని శివాజీని ఆడుకుంది. కామెంట్లతో, పోస్ట్ లతో బ్యాక్ టూ బ్యాక్ ఎటాక్ చేస్తూ ఉపిరాడకుండా చేసింది. అంతేకాదు కొత్త సంవత్సరం సందర్భంగా బికినీ ఫోటోలు పంచుకుని ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
25
లైఫ్ స్టయిల్ విషయంలో అనసూయ రూటే సెపరేట్
తాను వేసుకునే డ్రెస్సుల విషయంలో, తన లైఫ్ స్టయిల్ విషయంలో స్వేచ్ఛగా ఉంటుంది అనసూయ. ఎవరినీ లెక్కచేయదు. తన భర్త కూడా అనసూయ విషయంలో ఫ్రీడమ్ ఇస్తాడు. ఆమె కంఫర్ట్స్ కే ప్రయారిటీ ఇస్తాడు. దీంతో అనసూయ ఫ్యామిలీ లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. భర్త బాగానే అర్థం చేసుకున్నాడు, కానీ పిల్లల విషయంలో అసలు ఇబ్బంది స్టార్ట్ అయ్యింది. అనసూయ బట్టలపై సొంత కొడుకే కామెంట్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించడం విశేషం.
35
అనసూయ బట్టలపై కొడుకు కామెంట్
అనసూయ బట్టలపై తన పెద్ద కొడుకు కామెంట్ చేస్తున్నాడట. పొట్టిబట్టలు వేసుకుంటే అభ్యంతరం చెబుతున్నాడట. మమ్మీ ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నావెందుకు అని ప్రశ్నిస్తున్నాడట. నచ్చలేదని మొహం మీదే చెబుతున్నాడట. ఓ రోజు తాను క్రాప్ టాప్ వేసుకుంటే, అది కింద వరకు వేసుకో మమ్మీ అన్నాడట. చాలా సార్లు మీ డ్రెస్ నచ్చలేదు మమ్మీ అంటూ ఓపెన్‌గానే కామెంట్ చేశాడట. ఇలా చాలా సార్లు పెద్ద కొడుకు కామెంట్ చేసినట్టు తెలిపింది అనసూయ.
అంతేకాదు కొడుక్కి కూడా అనసూయ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. నా బట్టలు నా ఇస్టం, నాకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకుంటానని చెప్పిందట. ముందు అర్థమయ్యేలా చెప్పిందట. ఆ తర్వాత సీరియస్‌గానే చెప్పిందట. అతను వేసుకునే టీషర్ట్ లు తనకు ఇష్టం ఉండదని, అలాంటిది వేసుకోనిస్తున్నా కదా, ఇది కూడా అలానే అని చెప్పిందట అనసూయ. సొంత కొడుకు అని కూడా చూడకుండా గట్టిగానే ఇచ్చిపడేసిందట. అయితే ఇది నాలుగేళ్ల క్రితం నాటి విషయం. అప్పుడు ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
55
యాంకరింగ్ వదిలేసిన అనసూయ
అనసూయ జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇది ఆమె లైఫ్‌నే మార్చేసింది. స్టార్ యాంకర్‌ని చేసింది. దాదాపు తొమ్మిదేళ్లు ఆమె ఈ షోకి యాంకర్‌గా చేసింది. రెండేళ్ల క్రితమే దీన్నుంచి తప్పుకుంది. నిర్వాహకుల ప్రవర్తన, తనపై వేసే జోకులు వంటివాటిని పరిగణలోకి తీసుకుని షోని వదులుకుందట. తనపై కమెడియన్లు డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, పంచ్ లు వేస్తుంటారు. ఇది చూసి తన పిల్లలు తప్పుగా అనుకుంటారనే ఉద్దేశ్యం కూడా అనసూయ జబర్దస్త్ ని వీడటానికి ఓ కారణమని సమాచారం. ప్రస్తుతం నటిగానే పరిమితమయ్యింది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఇటీవల రేణు దేశాయ్‌తో కలిసి ఓ కొత్త మూవీని ప్రారంభించుకుందీ మాజీ యాంకర్.