Anasuya Bharadwaj: పుష్పరాజ్ స్పెర్మ్ కౌంట్ 1 ఔట్ ఆఫ్ 10.. అనసూయ పోస్ట్ దుమారం..అర్జున్ రెడ్డి, సాలార్, ధృవ కౌంట్ ఎంతంటే?

Published : Jul 09, 2026, 01:42 PM IST

Anasuya Bharadwaj: యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సినిమాల్లో బిజీ అయిపోయింది అనసూయ. నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక దుమారం రేపుతుంటుంది. తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది అనసూయా భరద్వాజ్. విజయ్ దేవరకొండతో జరిగిన సోషల్ మీడియా వార్ ను మళ్లీ మొదలు పెట్టిందా?

PREV
15
మరో దుమారం రేపిన అనసూయ..

యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తన ముక్కుసూటితనంతో, ఎవరికీ భయపడకుండా మనసులోని భావాలను పంచుకోవడం ఆమె శైలి. తాజాగా అనసూయ ఒక మహిళా డాక్టర్ చేసిన సృజనాత్మక వీడియోను నెట్టింట షేర్ చేస్తూ ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. "మన సినిమా పిచ్చోళ్లకు ఇలా చెప్తేనే కరెక్ట్ ఏమో" అంటూ ఆమె చేసిన ఈ కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

25
హీరోల పాత్రలకు ఫెర్టిలిటీ రేటింగ్..

అసలు ఈ సంచలనానికి కారణం ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ నిహారిక అల్లు రూపొందించిన ఒక ఆసక్తికరమైన వీడియో. సమాజంలో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం (ఫెర్టిలిటీ), స్పెర్మ్ కౌంట్ వంటి సున్నితమైన అంశాలపై అవగాహన కల్పించడానికి ఆమె ఒక సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. టాలీవుడ్ పాపులర్ సినిమాల్లోని హీరోల పాత్రల జీవనశైలి, వారి అలవాట్ల ఆధారంగా వారి ఫెర్టిలిటీ రేటింగ్ ఎలా ఉంటుందో ఆ వీడియోలో విశ్లేషించారు. 

ఈ విశ్లేషణలో 'అపరిచితుడు' చిత్రంలోని రామం పాత్రకు అత్యధికంగా 9/10 స్కోర్ లభించింది. అతను పూర్తిగా శాకాహారి కావడం, శారీరక దృఢత్వం కలిగి ఉండటంతో పాటు ఎటువంటి వ్యసనాలు లేకపోవడమే అందుకు కారణం. అలాగే 'ధృవ' సినిమాలోని రామ్ చరణ్ ఐపీఎస్ పాత్రకు 9/10 ఇచ్చినా, ఒకవేళ ఆ సిక్స్ ప్యాక్ బాడీ సహజంగా కాకుండా స్టెరాయిడ్స్ వల్ల వస్తే స్పెర్మ్ కౌంట్ సున్నా అవుతుందని ట్విస్ట్ ఇచ్చారు డాక్టర్.

35
మహేష్, ప్రభాస్ పాత్రలకు ఎంత రేటింగ్?

ఇక నిహారిక ఇచ్చిన రేటింగ్స్ లో 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ బాబు పోషించిన భరత్ పాత్రకు 7/10 స్కోర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండే విపరీతమైన పని ఒత్తిడి (స్ట్రెస్) వల్ల ఫెర్టిలిటీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. 'సలార్' లోని దేవా (ప్రభాస్) పాత్ర ఎప్పుడూ బొగ్గు గనుల్లోని వేడి, కాలుష్యంలో ఉండటం వల్ల అతనికి 6/10 మాత్రమే దక్కింది.

45
విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిందా?

అయితే, అనసూయ ఈ వీడియోను ముఖ్యంగా షేర్ చేయడానికి ప్రధాన కారణం 'అర్జున్ రెడ్డి' పాత్ర అని నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో అర్జున్ రెడ్డి పాత్ర విపరీతంగా ఆల్కాహాల్ సేవించడం, ధూమపానం, స్టెరాయిడ్స్ , గంజాయి వంటి వ్యసనాలకు బానిస కావడం వల్ల అతని ఫెర్టిలిటీ రేటింగ్ 6/10 కంటే తక్కువగా ఉంటుందని డాక్టర్ తేల్చి చెప్పారు. పాత వివాదాలను గుర్తుచేస్తూ అనసూయ ఈ వీడియోను పంచుకోవడం పెద్ద సంచలనంగా మారింది.

55
అల్లు అర్జున్ పుష్ప పాత్రకు భారీ షాక్ ..

మరోవైపు అందరికంటే తక్కువగా 'పుష్ప' చిత్రంలోని పుష్పరాజ్ పాత్రకు కేవలం 1/10 స్కోర్ లభించింది. శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, నిరంతరం గుట్కా నమలడం వల్ల అతనిలో స్పెర్మ్ కౌంట్ దారుణంగా పడిపోతుందని డాక్టర్ నిహారిక హెచ్చరించారు. మొత్తానికి, సినిమాలను కేవలం వినోదంగానే కాకుండా, వాటి ద్వారా యువతకు అవసరమైన ఆరోగ్య సందేశాన్ని అందించవచ్చని ఈ వీడియో నిరూపించింది. దీనిని అనసూయ తనదైన శైలిలో ట్విట్టర్‌లో షేర్ చేస్తూ సినిమా అభిమానుల అలవాట్లపై సంచలన కామెంట్స్ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories