ప్రభాస్ - అనుష్క సీన్ ను రిపీట్ చేశారుగా.. మామిడితోటలో పొట్టి డ్రెస్ లో భర్తతో కలిసి అనుసూయ రచ్చ..

First Published | Jun 15, 2023, 1:12 PM IST

యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తాజాగా తను పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన భర్తతో మామిడి తోటలో ఫొటోలకు ఫోజులిచ్చింది. 
 

బుల్లితెర అందాల యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  ఎంతటి క్రేజ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ఆడియెన్స్ లో తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం స్మాల్క్ స్క్రీన్ కు కూడా దూరమైంది. 
 

ఈ సందర్భంగా వెండితెరపై వరుస ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. నటిగా తనను తాను ఫ్రూవ్ చేసుకుంటోంది. బుల్లితెర నుంచి వెండితెర వైపు అనుసూయ జర్నీ స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. 
 


ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే సోషల్ ఇష్యూస్ పైనా స్పందిస్తుంటారు. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతూ సెన్సేషనల్ గా మారుతుంటుంది. 
 

మరోవైపు కేరీర్ లో  ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతోనూ గడుపుతుంటుంది. ఇటీవల ఫ్యామిలీ టూర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఏకంగా బికీనీలో దర్శమనిచ్చి మతులు పోగొట్టింది. ఇక తాజాగా తన భర్తతో కలిసి మళ్లీ దర్శనమిచ్చింది.
 

ఈసారి వాళ్ల మామిడి తోటలో సందడి చేసింది. మామిడి కాయలు తెంపుతూ కనిపించింది. ఈ సందర్భంగా భర్తతో రొమాంటిక్ గా ఫోజులిచ్చింది. తన భర్త ఎత్తుకోగా మామిడి కాయలు కోస్తూ ఆకట్టుకుంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘మిర్చి’లో ప్రభాస్ - అనుష్క సీన్ ను రిపీట్ చేశారుగా అని అంటున్నారు. 
 

అలాగే పొట్టి డ్రెస్ లోనూ గ్లామర్ మెరుపులు మెరిపించింది. థైస్ అందాలతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. ఇక అనసూయ రీసెంట్ గా ‘విమానం’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2 : ది రూల్’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!