భగవంత్ కేసరిలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సన్నివేశాలు.. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ అనసూయ కామెంట్స్

Sreeharsha Gopagani | Published : Oct 23, 2023 4:25 PM
Google News Follow Us

అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన తొలి చిత్రం ఇదే.

16
భగవంత్ కేసరిలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సన్నివేశాలు.. బ్రో ఐ డోంట్ కేర్ అంటూ అనసూయ కామెంట్స్

అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన తొలి చిత్రం ఇదే. శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. 

26

ముఖ్యంగా ఈ చిత్రంలో అనిల్ రావిపూడి ఆడపిల్లల గురించి ఇచ్చిన మెసేజ్ అందరికీ చేరువవుతోంది. శ్రీలీల నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో అనిల్ రావిపూడి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో ఆడపిల్లలని చైతన్య వంతులని చేసే విధంగా అనిల్ రావిపూడి కొన్ని సన్నివేశాలు పెట్టారు. 

36

అమ్మాయిల శరీర భాగాలని ఎక్కడ టచ్ చేయకూడదో చెబుతూ స్కూల్ కార్యక్రమంలో బాలయ్య వివరిస్తారు. అలా ఎవరైనా చేస్తే వెంటనే అమ్మకు చెప్పాలని బాలయ్య అంటారు. 

Related Articles

46

దీనిపై నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలని చైతన్య వంతులని చేయడంలో భగవంత్ కేసరి చిత్రం ద్వారా కేవలం వారంలోనే రీచ్ అయింది. మిగిలిన మాధ్యమాలకు పదేళ్లు పడుతుంది అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. దీనిపై అనసూయ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

56

ఈ విషయం గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పలేం. భగవంత్ కేసరి చిత్రం గురించి నేను ఫీల్ అవుతున్న విషయాన్ని మీరు చెప్పినందుకు థాంక్యూ రాహుల్ రవీంద్రన్. బాలకృష్ణ సర్ చెప్పిన డైలాగ్స్ ని మరచిపోలేము. ఆ లైన్స్ ని నేను సోషల్ మీడియా కోట్స్ లో వాడేస్తా.. ఎందుకంటే.. ఐ (డోంట్) కేర్ బ్రో అంటూ అనిల్ రావిపూడి అనసూయ టాగ్ చేసింది. 

66

బాలయ్య తెలంగాణ యాసలో నటించిన తొలి చిత్రం ఇది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ లో వైవిధ్యంగా ప్రజెంట్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. 

 

Read more Photos on
Recommended Photos