విజ్జి పాపా దసరా శుభాకాంక్షలు.. ఆర్మీ యూనిఫాంలో శ్రీలీలా యాక్షన్ అవతార్.. పిక్స్

First Published | Oct 23, 2023, 3:51 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా తాజాగా స్టన్నింగ్ ఫొటోలను పంచుకుంది. తన లాస్ట్ ఫిల్మ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టిల్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లో మెరిసి ఆకట్టుకుంది.
 

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  తన సినిమాల సందడిని మొదలు పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. 
 

రీసెంట్ గా శ్రీలీలా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీలో విజ్జిపాపా అనే కీలకమైన పాత్రలో నటించింది. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఆమె రోల్ ఉండటం విశేషం. చాలా స్ఫూర్తిదాయకంగా తెరపై మెప్పించింది.
 


ఇక ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’కి  మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ మధ్య వచ్చిన పండుగలను టచ్ చేస్తూ చిత్రంనుంచి అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దసరా పండుగా శుభాకాంక్షలు చెబుతూ శ్రీలీలా ఇంట్రెస్టింగ్ ఫొటోలను పంచుకుంది.
 

భగవంత్ కేసరి సెట్ లో తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంది. ఆర్మీ యూనిఫాంలో.. యాక్షన్ అవతార్ లో కొన్ని స్టిల్స్ ను షేర్ చేసింది. జవాన్ గా శ్రీలీలా లుక్ అదిరిపోయింది. ఆమె బీటీఎస్ పిక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లోనూ ఓ ఫొటోను షేర్ చేసింది. హాఫ్ శారీలో అందంగా దర్శనమిచ్చింది. బాలయ్యతో కలిసి ఫొటోకు ఫోజిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో శ్రీలీలా వెలిగిపోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆమె ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

అయితే, శ్రీలీలా ఇప్పటి వరకు డాన్స్, గ్లామర్, నటన పరంగా అదరగొట్టింది. ‘స్కంద’లో ఓ సాంగ్ కూడా పాడింది. ఇక ఆమెను ఆర్మీ లుక్ లో చూసిన కొందరు అభిమానులు యాక్షన్ సీన్లలోనూ వెండితెరపై చూడాలని ఆశిస్తున్నారు. ఆ దిశగా శ్రీలీలా అడుగులేస్తే స్టార్ హీరోయిన్లకు బిగ్ ప్రాజెక్ట్స్ లో పోటీ తప్పదని అభిప్రాయపడుతున్నారు. 

Latest Videos

click me!