‘నీకిప్పుడు అవసరమా ఆంటీ’.. జిమ్ వీడియో పంచుకుంటూ అనసూయ ఇంట్రెస్టింగ్ నోట్

First Published | Oct 24, 2023, 5:44 PM IST

యాంకర్ నుంచి బిజీయెస్ట్ యాక్టర్ గా మారింది అనసూయ భరద్వాజ్. వరుస చిత్రాలతోనూ అలరిస్తుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటుంది. తాజాగా వర్కౌట్ వీడియో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. 
 

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ‘జబర్దస్త్’తో టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు సినిమా అవకాశాలనూ అందుకుంటూ వచ్చింది. 
 

‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో వెండితెరపై అలరించింది. నటిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు అందుకుంది. దాంతో యాంకర్ కెరీర్ కు గుడ్ బై చెప్పి యాక్టింగ్ కెరీర్ పైనా ఫుల్ ఫోకస్ పెట్టింది. చేతి నిండా సినిమాలతో బిజీయెస్ట్ యాక్టర్ గా మారింది. 
 


బుల్లితెరకు దూరమైన అనసూయ సోషల్ మీడియాలోనూ మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. ఆయా అంశాలపై తన వాయిస్ వినిపిస్తుంటారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటూ ఉంటుంది. తాజాగా వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. 
 

జిమ్ లో అనసూయ హెవీ వర్కౌట్స్ చేస్తూ చెమటలు కక్కిస్తోంది. ఫ్యాట్ బర్న్ చేసేందుకు జిమ్ లో ఎంతగానో శ్రమిస్తోంది. రకారకాల వర్కౌట్స్ తో ఆకట్టుకుంది. ఆ వీడియోను పంచుకుంటూ ఆసక్తికరంగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. సాధారాణ మహిళ నుంచి కాళిగా మారాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చింది.
 

తన నోట్ లో.. ఈ దసరాను చెడుపై మంచి సాధించిన విజయంలా జరుపుకోండి.. సోమరితనంపై హార్డ్ వర్క్, సందేహం, భయంపై ఏకాగ్రత, నిబద్ధత, అంకితభావం విజయాన్ని జరుపుకునేలా చేయండి. రెండేళ్ళ  కింద మా నాన్నను కోల్పోయాను. నాకు అన్నింటిపై ఆసక్తి, ఆశలు పోయాయి. ఆహారపు అలవాట్లు, నిద్ర విధానాలపై నియంత్రణ లేదు. మా నాన్న ‘ఆరోగ్యమే మహాభాగ్యమం’ అని ఎప్పుడూ చెబుతుండే వారు. 
 

ఇక ఈ దసరాతో ప్రారంభించాను. మహిళలందరినీ ఈవీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను. తమపై దృష్టి పెట్టండి. స్త్రీ శక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు.. ఎవరు ఏమి చెప్పినా .. ’నీకిప్పుడు అవసరమా ఆంటీ’.. ‘35 దాటినా ఎందుకివాన్ని’.. ‘ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు కదా’.. వగైరా.. వీళ్ళంతా మన ఎదుగుదలపై భయపడుతుంటారు. తనలో పరివర్తనను మేల్కొల్పుకునే ప్రతి స్త్రీ ఒక కాళినే. అంటూ నోట్ లో చెప్పుకొచ్చింది. 
 

అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో రకంగా ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఆమె పెట్టే పోస్టులు, చేసే కామెంట్లతో వైరల్ అవుతుంటారు. ఇక తాజాగా పంచుకున్న వర్కౌట్ వీడియోతో మరోసారి అనసూయ పోస్టు ఆసక్తికరంగా మారింది. ఆమె పోస్టును కొందరు నెటిజన్లు లైక్స్,, కామెంట్లు పెడుతూ తమ అభిప్రాయాలనూ వ్యక్తం చేస్తున్నారు. 

ఇక అనసూయ ఈ ఏడాది నటిగా ఫుల్ బిజీగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఐదు సినిమాలు ‘మైఖేల్’, ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘పెద్దకాపు’,  రీసెంట్ గా ‘ప్రేమ విమానం’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం తమిళంలోని ‘ఫ్లాష్ బ్యాక్’,  తెలుగులోని పాన్ ఇండియా చిత్రం Pushpa 2 The Ruleలోనూ నటిస్తోంది. 
 

Latest Videos

click me!