ప్రస్తుతం అనన్య పాండే హిందీలో `గెహ్రైయాన్` చిత్రంలో నటించింది. దీపికా పదుకొనె మెయిన్ లీడ్‌చేయగా, ఆమెకి సిస్టర్‌గా కనిపిస్తుంది అనన్య పాండే. శకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాలో దీపికా పదుకొనె, అనన్య పాండేతోపాటు సిద్ధాంత్ చతుర్వేది, ధైర్యా కర్వా, నసీరుద్దీన్ షా, రజత్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.