హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేసే తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ఇప్పుడు బర్త్ డే పార్టీలో రెచ్చిపోయింది. ఫ్రెండ్స్ తో కలిసి ఏకంగా బోట్‌లో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
`వకీల్ సాబ్` చిత్రంతో పాపులర్ అయిన అనన్య నాగళ్ల(Ananya Nagalla) ఫ్రెండ్స్ తో కలిసి తన పుట్టిన రోజుని జరుపుకున్న ఫోటోలను తాజాగా పంచుకుంది. ఏకంగా సముద్రం మధ్యలో బోట్‌లో ఆమె బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఇది అనన్యకి గొప్ప అనుభూతినిచ్చిందట. తాజాగా వీటిని అభిమానులతో పంచుకుని ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.
29
Ananya Nagalla Birthday Celebrations
అంతేకాదు రాత్రి పార్టీలోనూ రచ్చ చేసింది. కేక్ ముఖానికి పూసుకుని, బీర్ బాటీల్‌తో చీర్స్ కొడుతూ నానా రచ్చ చేసింది. ప్రస్తుతం ఆమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
39
Ananya Nagalla Birthday Celebrations
అయితే అనన్య నాగళ్ల చాలా రోజుల క్రితం ఫోటోలను ఇప్పుడు పంచుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకుంటే ఆమె బర్త్ డే జనవరిలో ఉంది. తన థ్రో బ్యాక్ పిక్స్ ని షేర్ చేసినట్టు తెలుస్తుంది. కానీ బర్త్ డే ఎప్పటిదైనా ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి.
49
Ananya Nagalla Birthday Celebrations
అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ వారిని ఖుషి చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
59
Ananya Nagalla Birthday Celebrations
పర్ ఫెక్ట్ నడుమందాలతో కనువిందు చేస్తూ కుర్రాళ్లని తన వైపు తిప్పుకుంటుంది. సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్‌ని పెంచుకుంటుంది. అనన్య గ్లామర్ ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
69
Ananya Nagalla Birthday Celebrations
తెలంగాణకి చెందిన అనన్య నాగళ్ల సాఫ్ట్ వేర్‌గా జాబ్‌ని వదులుకుని మరీ సినిమాల్లోకి వచ్చింది. `మల్లేశం` చిత్రంతో ఆమె తెలుగు తెరకి పరిచయం అయ్యింది. ఇందులో ఓ పేదింటి ఇళ్లాలుగా నటించి ఆకట్టుకుంది. పాత్రకి ప్రాణం పోసింది. ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకుంది అనన్య.
79
Ananya Nagalla Birthday Celebrations
ఆ తర్వాత `ప్లే బ్యాక్`, `వకీల్ సాబ్`, `మ్యాస్ట్రో`వంటి చిత్రాల్లో మెరిసింది. `వకీల్ సాబ్`లో పవన్ కళ్యాణ్ నటించడంతో ఈ సినిమాతో అనన్యకి మరింత గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
89
Ananya Nagalla Birthday Celebrations
ఇటీవల ఓ కొత్త సినిమాకి సైన్ చేసింది. ఇది చిత్రీకరణ కూడా ప్రారంభించుకుంది. ఇలా నెమ్మదిగా హీరోయిన్‌గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం రెగ్యూలర్‌గా హాట్ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఆమె ప్రయత్నాలు ఫలించి మున్ముందు మరిన్ని మంచిచిత్రాలు వరిస్తాయేమో చూడాలి.
99
Ananya Nagalla Birthday Celebrations
హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేసే తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ఇప్పుడు బర్త్ డే పార్టీలో రెచ్చిపోయింది. ఫ్రెండ్స్ తో కలిసి ఏకంగా బోట్‌లో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.