హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన స్ట్రైట్ తెలుగు చిత్రం ఇది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. దుల్కర్, మృణాల్ ప్రేమ కథకి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు.