ఎపిసోడ్ ప్రారంభంలోనే... మాధవ్ స్నేహితులు,మాధవ్ గురించి వెతుకుతూ ఉండగా, మాధవ అక్కడికి వస్తాడు. సరే నేను ఇంటికి వెళ్తాను అని మాధవ్ అనగా ప్రతి ఒక్కలు అమ్మాయిలు వెనక తిరిగితే, నువ్వు ఆంటీ వెనక తిరుగుతున్నావు ఏంట్రా? అని వాళ్ళ ఫ్రెండ్స్ మాధవిని ఎక్కిరిస్తారు. మాధవ్ చాలాసేపు ఓర్చుకొని, ఇంక ఆపుకోలేక వాళ్ళని గట్టిగా కొట్టి నాది అనుకున్నది నాదే. నేను అయినా రాధని ప్రేమతో కావాలనుకోవట్లేదు. నా ప్రేమని వద్దనుకున్నదని పంతంతో దక్కించుకోవాలనుకుంటున్నాను. అయినా అమ్మాయిలు వెనుక తిరగడానికి నేనేమైనా కాలేజ్ కుర్రాడి నా? అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.