Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య

Published : Apr 19, 2026, 03:57 PM IST

నటి అనన్య నాగళ్ళ కూడా ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ ద్వారా ఆదాయం పొందుతున్నారు. అయితే తాను డబ్బు తీసుకుని వల్గర్ ఫోటోలు షేర్ చేయను అని అనన్య అంటున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Ananya Nagalla

గత కొన్ని రోజులుగా ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సెలెబ్రిటీలు కొంతమంది ఇంస్టాగ్రామ్ లో సమ్ స్క్రిప్షన్ ఆప్షన్ తో ఫాలోవర్స్ నుంచి నెలవారీ చందా వసూలు చేస్తూ ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తున్నారు. సబ్ స్క్రైబర్స్ ని ఆకర్షించేందుకు విష్ణుప్రియ లాంటి వాళ్ళు బోల్డ్ గా, వల్గర్ గా ఫోటోలు పెడుతున్నారు.

25
సబ్ స్క్రిప్షన్ ద్వారా ఆదాయం

దీనితో విష్ణుప్రియ పై విమర్శలు మొదలయ్యాయి. విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ ని ఇప్పటి వరకు 7645 మంది సబ్ స్క్రైబ్ చేసుకుని ఉన్నారు. అంటే లక్షల్లో విష్ణుప్రియ సంపాదన ఉంటోంది. ఇప్పుడు విష్ణుప్రియ బాటలోనే అనన్య నాగళ్ళ లాంటి యంగ్ బ్యూటీలు పయనిస్తున్నారు. అనన్య నాగళ్ళ కూడా సబ్ స్క్రిప్షన్ ద్వారా ఆదాయం పొందుతోంది.

35
రికార్డ్ చేసిన వీడియో

ఇప్పటికే ఆమె అకౌంట్ ని 700 మందికి పైగా సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. అయితే తాను వల్గర్ ఫోటోలు షేర్ చేసి డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఇలా చేయడం లేదని.. సోషల్ సర్వీస్ చేయబోతున్నట్లు అనన్య పేర్కొంది. గతంలో రికార్డ్ చేసిన వీడియోను అనన్య పోస్ట్ చేశారు. ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ పై విమర్శలు వస్తుండడంతో అనన్య ఈ వీడియో షేర్ చేసింది.

45
సోషల్ సర్వీస్ కోసం

సబ్ స్క్రైబర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాను సోషల్ సర్వీస్ కోసం ఉపయోగిస్తానని అనన్య పేర్కొన్నారు. అదే విధంగా సబ్ స్క్రైబర్ల కోసం తాను డివోషనల్ కంటెంట్, యోగ లాంటి వీడియోలు షేర్ చేస్తానని అని అనన్య పేర్కొంది. వల్గర్ ఫోటోల కోసం తాను సబ్ స్క్రిప్షన్ ని ఉపయోగించని అని అనన్య పేర్కొన్నారు.

55
గ్లామరస్ ఫొటోస్

అనన్య టాలీవుడ్ లో నటిగా రాణిస్తున్నారు. వకీల్ సాబ్, శాకుంతలం, పొట్టేలు లాంటి చిత్రాలు అనన్యకి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ కూడా అనన్య పాపులర్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories