పొట్టేలు చిత్రంలో అనన్య లాంగ్ లిప్ లాక్ సీన్ లో నటించింది. చాలా బోల్డ్ గా అనన్య లిప్ లాక్ చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. ఇంతవరకు మీరు బోల్డ్ గా నటించలేదు. పొట్టేలు చిత్రంలో నటించారు. ఇప్పుడు తంత్ర చిత్రంలో కూడా అలాంటివి ఉన్నాయా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. అనన్య బదులిస్తూ.. ఆ చిత్రంలో లిప్ లాక్ సీన్ చాలా అవసరం. ఆ మూవీ ప్రెస్ మీట్ లో దాని గురించి మాట్లాడతా. తంత్ర చిత్రంలో ఎమోషనల్, గ్లామర్, రొమాంటిక్, హారర్ ఇలా అన్ని సన్నివేశాలు ఉన్నాయని అనన్య క్లారిటీ ఇచ్చింది.