వదిన దగ్గర నుంచి శిక్ష తప్పించుకున్నావు కానీ నాకు దొరికిపోయావు, ఇప్పుడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. అదే సమయంలో రాజ్ కిందికి రావడంతో అమ్మాయిని డ్రాప్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు సీతారామయ్య. మీరు చెప్పిన దగ్గర నుంచి రోజూ డ్రాప్ చేస్తున్నాను తాతయ్య అంటాడు రాజ్. సరే అని చెప్పి కావ్యని ఆశీర్వదించి పంపిస్తారు చిట్టి దంపతులు. మరోవైపు కారులో వెళ్తున్న కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మీరు ఇంకా రాలేదు అంటుంది.