జుహూలో ఉన్న 'జల్సా' ముంబైలోని అత్యంత ఫేమస్ సెలబ్రిటీ ఇళ్లలో ఒకటి. ఈ రెండంతస్తుల బంగ్లా బచ్చన్ ఫ్యామిలీకి నివాసంగా మారింది. ఎన్నో ఏళ్లుగా వాళ్లు షేర్ చేసే ఫొటోల్లో ఈ ఇల్లు మనకు కనిపిస్తూనే ఉంటుంది.
'సత్తే పే సత్తా' సినిమాలో కలిసి పనిచేసిన తర్వాత ఫిల్మ్‌మేకర్ రమేష్ సిప్పీ ఈ ఇంటిని బచ్చన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. 'జల్సా' అంటేనే వేడుక అని అర్థం.
గ్రాండ్ ఇంటీరియర్స్‌కు కేరాఫ్ అడ్రస్
సాంప్రదాయ భారతీయ శైలి, మోడ్రన్ ఇంటీరియర్స్ కలయికే ఈ జల్సా. పెద్దపెద్ద లివింగ్ రూమ్స్, పాతకాలపు ఇత్తడి శిల్పాలు, అందమైన షాండ్లియర్లు, ఆర్ట్‌వర్క్, మార్బుల్ ఫ్లోరింగ్, రిచ్ వుడెన్ డిజైన్స్ ఈ ఇంట్లో కనిపిస్తాయి.
ముఖ్యంగా లివింగ్ రూమ్‌లో ఎత్తైన ఆర్చ్‌లు, ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉండే గ్లాస్ డోర్స్, పెద్ద ఆర్ట్ కలెక్షన్ ఉన్నాయి. పురాతన వస్తువులు, డెకరేషన్ విషయంలో బచ్చన్ ఫ్యామిలీ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ ఇంటీరియర్స్ చూస్తే అర్థమవుతుంది.
అభిమానులకు సుపరిచితమైన గార్డెన్, ఎంట్రన్స్
జల్సా ఎంట్రన్స్, గార్డెన్ అందరికీ బాగా తెలిసినవే. పచ్చని చెట్లు, మొక్కలు, ఆ చెక్క గేట్లు బచ్చన్ దిగిన ఎన్నో ఫొటోలకు బ్యాక్‌డ్రాప్‌గా నిలిచాయి.
ప్రతి ఆదివారం జల్సా బయటకు వచ్చి అభిమానులను పలకరించడం బచ్చన్‌కు అలవాటు. అందుకే ఈ ఇల్లు ఆయన అభిమానులకు ఒక మీటింగ్ పాయింట్‌గా మారిపోయింది. ఆయన్ని ఒక్కసారైనా చూడాలని అభిమానులు ఈ బంగ్లా బయట గుమిగూడుతారు. బచ్చన్ కూడా ఎన్నో ఏళ్లుగా తన అభిమానులతో ఈ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.