అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌ 5 ట్రెండింగ్‌ మూవీస్‌ ఇవే.. థియేటర్లో డిజాస్టర్‌ ఓటీటీలో దుమ్మురేపుతున్న జాన్వీ మూవీ

Published : Oct 28, 2025, 04:43 PM IST

అమెజాన్‌ ప్రైమ్‌లో డిజాస్టర్‌ మూవీ ఓటీటీలో ట్రెండ్‌ అవుతోంది. జాన్వీ కపూర్‌  సినిమా ఇండియా వైడ్‌గా నెంబర్‌ 1 స్థానంలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. మరి ఇంతకి టాప్‌ 5లో ఉన్న మూవీస్‌ ఏంటో చూద్దాం. 

PREV
16
అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌ 5 మూవీస్‌ ఇవే

ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్‌ ఉంది. అది ఎంత అంటే ఓటీటీ రిలీజ్‌ డేట్‌లను బట్టే సినిమాలను థియేటర్లలో విడుదల చేసేంత కావడం విశేషం. ఓటీటీలో ప్రధానంగా ఉన్న మాధ్యమం అమెజాన్‌ ప్రైమ్‌. ఇందులో ప్రస్తుతం పలు క్రేజీ మూవీస్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. థియేటర్లలో డిజాస్టర్‌ అయిన మూవీస్‌ ఓటీటీలో దుమ్మురేపుతుండటం విశేషం. జాన్వీ కపూర్‌ సినిమా ఇప్పుడు టాప్‌లో ఉండటం మరో విశేషం.

26
ఇండియా వైడ్‌గా నెంబర్‌ 1గా `పరమ్‌ సుందరి`

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో జాన్వీ కపూర్‌ నటించిన `పరమ్‌ సుందరి` టాప్‌లో ఉండటం విశేషం. జాన్వీకపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా కలిసి నటించిన `పరమ్‌ సుందరి` మూవీ ఆగస్ట్ 29న థియేటర్లో విడుదలైంది. తుషార్‌ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఓ రకంగా డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. గత వారమే ఇది ఓటీటీలోకి వచ్చింది. అప్పుడే ఇండియా వైడ్‌గా నెంబర్‌ 1 స్థానంలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

36
రెండో స్థానంలో లావణ్య త్రిపాఠి మూవీ

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా రెండో స్థానంలో ట్రెండ్‌ అవుతోన్న మూవీ `తనాల్‌`. అథర్వ మురళీ హీరోగా నటించిన ఈ యాక్షన్‌ డ్రామా తమిళ చిత్రానికి రవీంద్ర మాధవ దర్శకుడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదలైంది. అక్కడ ఇది పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ ఓటీటీలో మాత్రం రచ్చ చేస్తోంది. ఏకంగా ఇండియా వైడ్‌గా ఇది టాప్‌ 2లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇది దీపావళి సందర్భంగా గత వారమే ఓటీటీలోకి వచ్చింది. అంతలోనే బిగ్‌ మూవీస్‌ని కాదని టాప్‌లోకి రావడం విశేషం.

46
ఇండియాలో స్పానిష్‌ మూవీ ట్రెండింగ్‌

ఇండియాలో టాప్‌ 3లో ట్రెండ్‌ అవుతున్న మూవీలో స్పానిష్‌ చిత్రం కూడా ఉండటం విశేషం. `అవర్‌ ఫాల్ట్` అనే స్పానిష్‌ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది. ఈ చిత్రానికి డామింగో గోంజాలెజ్‌ దర్శకత్వం వహించగా, నిలోక్‌ వాల్లేస్‌, గాబ్రియెల్‌ గావెరా జంటగా నటించారు. ఒక ప్రేమ జంట బ్రేకప్‌ చెప్పుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓ పెళ్లిలో కలుస్తారు. ఆ సమయంలో వారిలో కలిగిన రియలైజేషన్‌ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది. ఇది ఇండియన్‌ ఓటీటీ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకోవడం విశేషం.

56
టాప్‌లో 4 `ఓజీ` నటుడి మూవీ

ఇటీవల `ఓజీ` సినిమాలో నటించి తన గాంభీర్యమైన గొంతుతో ఆకట్టుకున్న అర్జున్‌ దాస్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బాంబ్‌`. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విశాల్‌ వెంకట్‌ దర్శకుడు. ఇందులో అర్జున్‌ దాస్ తోపాటు తెలుగు అమ్మాయి శివాత్మిక రాజశేఖర్‌ హీరోయిన్‌గా నటించింది. చాలా సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈ సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కానీ ఓటీటీలో దుమ్ములేపుతుంది. ప్రైమ్ లో టాప్‌ 4లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

66
టాప్‌ 5లో రజనీకాంత్ `కూలీ`

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా టాప్‌ 5లో ట్రెండ్‌ అవుతున్న సినిమా `కూలీ`. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున విలన్‌ రోల్‌ చేశారు. అమీర్‌ ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేయగా, ఉపేంద్ర, శృతి హాసన్‌, సత్య రాజ్‌, సౌబిన్‌ షాహిర్‌ కీలక పాత్రల్లో మెరిశారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ మూవీ థియేటర్లో ఫర్వాలేదనిపించింది. ఐదు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి నెల రోజులకుపైగానే అవుతుంది. ఇది ప్రైమ్‌లోనే కాదు నెట్‌ ఫ్లిక్స్ లోనూ టాప్‌ 5లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories