వాడికి అమ్మ ప్రేమ తెలియదు, ఏడిపించేసిన అన్నదమ్ములు... యావర్ జీవితంలో ఇంత విషాదం ఉందా?

Published : Nov 09, 2023, 07:03 PM ISTUpdated : Nov 09, 2023, 07:11 PM IST

ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ మేట్స్ ని కలిసేందుకు ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ కి వస్తున్న విషయం తెలిసిందే. నేడు యావర్ ని కలిసేందుకు అన్నయ్య వచ్చాడు.   

PREV
16
వాడికి అమ్మ ప్రేమ తెలియదు, ఏడిపించేసిన అన్నదమ్ములు... యావర్ జీవితంలో ఇంత విషాదం ఉందా?
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ హౌస్లో ఈ వారం మొత్తం ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. రెండు నెలలకు పైగా ఇంటికి దూరమైన కంటెస్టెంట్స్ లో జోష్ నింపేందుకు ఫ్యామిలీ వీక్ ఏర్పాటు చేశారు. హౌస్ మేట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. శివాజీ కొడుకు, అర్జున్ భార్య, అశ్విని తల్లి, గౌతమ్ తల్లి, ప్రియాంకకు కాబోయే భర్త, భోలే భార్య హౌస్లో అడుగుపెట్టారు 


 

26
Bigg Boss Telugu 7

నేడు శోభా శెట్టి తల్లి, అమర్ దీప్ భార్య వచ్చారు. అలాగే యావర్ అన్నయ్య కూడా వచ్చాడు. హౌస్ మేట్స్ ని కలిసేందుకు ఒక్కొక్కరు వస్తుండగా యావర్ తన వంతు కోసం ఆతృతగా ఎదురుచూశాడు. యావర్ కోసం అన్నయ్య వచ్చాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూ మూస్తూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టాడు. 

36
Bigg Boss Telugu 7

యావూ... మేర బచ్చా! అని మైక్ లో వినిపించగా యావర్ ముఖంలో వెయ్యి దీపాలు వెలిగాయి. డోర్ దక్కరకు పేరుగెత్తుకెళ్లాడు. అక్కడ అన్నయ్య లేడు. ఇంట్లో నుండే యావర్ అన్నయ్య సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు. హౌస్ మేట్స్ ని పలకరించేందుకు యావర్ అన్నయ్య రెండు తెలుగు పదాలు నేర్చుకున్నాడు. 

 

46
Bigg Boss Telugu 7

అనంతరం గౌతమ్ కి కృతజ్ఞతలు చెప్పాడు. గౌతమ్ తల్లి యావర్ ని అక్కున చేర్చుకుని నీకు కూడా నేను అమ్మనే అన్నారు. అందుకే గౌతమ్ కి యావర్ అన్నయ్య థాంక్స్ చెప్పాడు. వీడికి అమ్మ ప్రేమ అంటే తెలియదు. అని ఆయన కూడా ఏడ్చేశాడు. అన్నదమ్ములు తల్లిని తలచుకుని ఏడవడం గుండెలు బరువెక్కేలా చేసింది. 

56
Bigg Boss Telugu 7

అనంతరం తమ్ముడు యావర్ ని అన్నయ్య మోటివేట్ చేశాడు. నువ్వు ఫైటర్ వి. పోరాడి కప్పు గెల్చుకుని రా. అందరూ నువ్వు నువ్వు తెచ్చే కప్పు కోసం ఎదురుచూస్తున్నారు.. అని చెప్పాడు. అనంతరం ఇంటిని వీడాడు. 

 

66
Bigg Boss Telugu 7

యావర్ కి సర్వస్వం  అన్నయ్యే అని తెలుస్తుంది. చిన్నప్పుడే అమ్మ మరణించడంతో అన్నయ్య పెంచాడట. హౌస్లోకి వచ్చినప్పటి నుండి యావర్ అన్నయ్య గురించే మాట్లాడతున్నాడు. అన్నయ్య రాసిన లెటర్ తేజ కోసం త్యాగం చేస్తూ చాలా ఏడ్చాడు. బాల్యం నుండి యావర్ అమ్మ ప్రేమ కోల్పోయాడట. 

Read more Photos on
click me!

Recommended Stories