పవన్ కళ్యాణ్ ‘బ్రో’తో పాటు.. ఈనెలలో ఇంకెన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఫుల్ డిటేయిల్స్

First Published | Jul 2, 2023, 4:14 PM IST

జూలై నెలలో పది సినిమాల వరకు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ నటించి ‘బ్రో’ చిత్రం కూడా ఇదే నెలలో విడుదల కాబోతోంది. దాంతో పాటు మరిన్ని చిత్రాలు రిలీజ్ కానున్నాయి. 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగౌశర్య (Naga Shaurya)   నటించిన లేటెస్ట్ చిత్రం ‘రంగబలి’(Rangabali).  ఫన్‌ అండ్ యాక్షన్‌ తో కూడిన ఈ చిత్రంపై రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో ఆసక్తి పెరిగింది. చిత్రం కమర్షియల్‌ అంశాలతోనూ రూపొందింది. ఈ సినిమాతో పవన్‌ బసంశెట్టి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. `దసరా` విలన్‌ షైన్‌ టామ్‌ చాకో నెగటివ్‌ రోల్‌ చేస్తుండటం విశేషం. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మించింది. యుక్తీ దరేజా హీరోయిన్. జులై 7న విడుదల కాబోతుంది.
 

ఈ శుక్రవారం జూలై 7నే మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరావాణి కొడుకు శ్రీ సింహ (Sri Simha) నటించిన ‘బాగ్ సాలే’ చిత్రం కూడా విడుదల కానుంది. ప్రణీత్ బ్రహ్మానందపల్లి దర్శకుడు. నేహా సోలంకి హీరోయిన్. సత్య, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, హర్ష చముడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకుడు. 
 


స్టార్ యాక్టర్ జగపతి బాబు (Jagapathi Babu) నటించిన యాక్షన్ పీరియడ్ థ్రిల్లర్ గా రూపొందిన ‘రుద్రంగి’ కూడా ఈ శుక్రవారంమే (జూలై 7) విడుదలవుతోంది. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. మమతా మోహన్ దాస్, విమల రామన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నౌఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు. 
 

సైన్స్ ఫిక్షన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న చిత్రం ‘7:11 pm’. సాహస్ పగడాల, దీపికా రెడ్డి జంటగా నటించారు. చైతూ మదల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా జూలై 7న థియేటర్లలో విడుదల కాబోతోంది. 
 

సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘హిడింబ’. యంగ్ హీరో అశ్విన్ బాబు, నందితా శ్వేతా హీరోహీరోయిన్లు. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ తో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచారు. ఈ చిత్రం కూడా జూలై లోనే రాబోతోంది. 

దాదాపు పదేళ్ల తర్వాత ‘మిస్సమ్మ’ డైరెక్టర్ జీ నీలకంట రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సర్కిల్’. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, తదితర అప్డేట్స్ అందించారు. సాయి రొనాక్, అర్షిన్ మెహత, రిచా పనాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా జూలై 7నే విడుదలకు షెడ్యూల్ చేసినట్టు తెలుస్తోంది. 
 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ ‘బేబీ’ (Baby). వైష్ణవి చైతన్య, సీత, మౌనికా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. సాయి రాజేష్ నీలమ్ దర్శకుడు. జూలై 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

జూలై 21న చైతన్య మాదాడి, లావణ్య సాహుకార జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. 

జూలై 21న చైతన్య మాదాడి, లావణ్య సాహుకార జంటగా నటించిన ‘అన్నపూర్ణ స్టూడియో’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. 
 

ఇక తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘బ్రో : ది అవతార్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ కలిసి నటించారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో భారీ అంచనాలు పెరిగాయి. సముద్రఖని దర్శకత్వం వహించారు. థమన్ సంగీత దర్శకుడు. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!