Allu Arjun: అల్లు అర్జున్ యాక్టర్ డాన్సర్ మాత్రమే కాదు, ఆయనలో చాలా కళలున్నాయి. తమ్ముడు శిరీష్ ఆ కళలన్నింటిని బయటపెట్టాడు. అందరి ముందు ఓపెన్‌గా చెప్పాడు. బండారం మొత్తం బట్టబయలు అయ్యింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `రాకా`తో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ముంబాయిలోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. సూపర్ హీరో ఎలిమెంట్లు ఉన్న నేపథ్యంలో చాలా వరకు సినిమాని గ్రీన్ మ్యాట్‌లోనే చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ వర్క్ జరుగుతుంది. అల్లు అర్జున్ ఎక్కువగా ముంబాయిలోనే ఉంటున్నారు. అందుకోసం ఆయన ఒక ఇంటినే కొనుగోలు చేశారు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ గూస్‌బంమ్స్ ని తెప్పిస్తుంది. మూవీ వేరే రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది.
24
అన్నఅల్లు అర్జున్ రహస్యాలు బయటపెట్టిన శిరీష్
ఈ క్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. బన్నీ రహస్యాలను బయటపెట్టాడు తమ్ముడు అల్లు శిరీష్. బన్నీ చిన్నప్పుడు చాలా చేశాడట. ఆయనలో చాలా కళలు ఉన్నాయట. అల్లు శిరీష్ ఆ విషయాలన్నీ వెల్లడించారు. అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో సుకుమార్‌తో `ఆర్య` సినిమా చేశాడు. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం హోస్ట్ గా చేసిన ఒక షోలో బన్నీ, సుకుమార్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. ఇందులో బన్నీలోని మల్టీ టాలెంట్స్ ని బయటపెట్టాడు శిరీష్. బన్నీకి చాలా కళలు తెలుసు అని తెలిపారు.
34
అల్లు అర్జున్‌లోని కళలు
అన్నింటి గురించి కొంత కొంత తెలుసుగానీ, దేంట్లో పూర్తి పరిజ్ఞానం లేదన్నాడు. కరాటే ఆరు నెలలు నేర్చుకున్నాడట. కుంపూ ఒక ఏడాది నేర్చుకున్నాడట. తెలుగు క్లాస్‌లు ఒక మూడు నెలలు వెళ్లాడట. ఆరు నెలలు గిటార్ నేర్చుకున్నాడట. క్యాషూ ఇలా చాలా నేర్చుకున్నాడట. ఇప్పుడు అడగండి, అన్నీ చేసి చూపిస్తాడని తెలిపారు శిరీష్. దీనికి పక్కనే ఉన్న బన్నీ నవ్వాపుకోలేకపోయాడు. ఒక సాంగ్‌కి గిటార్ చాలా బాగా నేర్చుకున్నాడట. ఎవరు వచ్చి అడిగినా ఆ సాంగ్ వాయిస్తుంటాడట. మధ్యలో సుకుమార్ కల్పించుకున్నాడు. ఇవే కాదు ఆర్ట్ కూడా బాగా వేస్తున్నాడట. తనకు ఒకసారి టక టకా ఒక ఆర్ట్ బొమ్మ గీసి చూపించాడట. ఆ తర్వాత తాను గమనిస్తే, తన ఫ్రెండ్స్ కి కూడా అదే వేసి చూపిస్తున్నాడట.
మొత్తంగా అటు తమ్ముడు శిరీష్, ఇటు సుకుమార్ కలిసి బన్నీ పరువంతా తీశారు. ప్రస్తుతం ఈ అరుదైన వీడియో ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు స్పందిస్తూ, భాయ్ మల్టీ టాలెంటెండ్ అని, వామ్మో అల్లు అర్జున్‌లో ఇన్ని కళలు ఉన్నాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బన్నీ అన్ని ఆర్ట్స్ లో బేసిక్‌గా నైపుణ్యం పొందాడు. సినిమాల్లో వాటిని కొద్ది కొద్దిగా వాడుతుంటాడట. మొత్తంగా ఐకాన్ స్టార్ మల్టీ టాలెంటెడ్ అని అర్థమవుతుంది. ఇది ఆయనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.