అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్

Published : Mar 01, 2026, 10:03 PM IST

అల్లు శిరీష్ పెళ్లి కొడుకు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కొత్త జంట రష్మిక, విజయ్ కూడా పాల్గొన్నారు. అదే విధంగా రాంచరణ్, సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. 

PREV
19
అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక

టాలీవుడ్ యువ నటుడు అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది. వివాహానికి ముందు జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంలో అల్లూ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

29
అల్లు అర్జున్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు

ఈ వేడుకలో అల్లు అర్జున్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు వరుడికి ఆశీస్సులు అందించారు. కుటుంబానికి చెందిన పెద్దలు, ఆత్మీయులు సంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. పసుపు రాయడం, ఆశీర్వాదాలు అందించడం వంటి ఆచారాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి.

39
మెగా ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు

మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాంచరణ్ ఉపాసన దంపతులు, సాయిధరమ్ తేజ్, నిహారిక, సురేఖ కొణిదెల తదితరులు పాల్గొని వరుడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అంతా ఆత్మీయ వాతావరణంలో సాగింది.

49
కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక

ఆసక్తికర విషయం ఏంటంటే ఇటీవల వివాహం చేసుకున్న కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి రాక అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లు ఫ్యామిలీతో విజయ్, రష్మికకి మంచి అనుబంధం ఉంది.

59
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రష్మిక, విజయ్ గీత గోవిందం చిత్రంలో నటించారు. ఆ మూవీతోనే రష్మిక, విజయ్ మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. మరోవైపు రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప 1, పుష్ప 2 చిత్రాలలో నటించారు.

69
అల్లు అరవింద్ కి బాలయ్యతో కూడా మంచి అనుబంధం

ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కి బాలయ్యతో కూడా మంచి అనుబంధం ఉంది. ఆహా ఓటీటీలో బాలయ్య అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.

79
రాంచరణ్ అయ్యప్ప మాలలో

అల్లు శిరీష్ పెళ్లి కొడుకు వేడుకలో రాంచరణ్ అయ్యప్ప మాలలో కనిపించారు. వరుడిని అభినందిస్తూ కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. వేడుక సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

89
అల్లు శిరీష్, నయనిక వివాహ వేడుక

అల్లు శిరీష్, నయనిక వివాహ వేడుక మార్చి 6న గ్రాండ్ జరగనుంది. అల్లు శిరీష్ టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

99
అల్లు శిరీష్ కి శుభాకాంక్షలు

మొత్తంగా అల్లు శిరీష్ పెళ్లి కొడుకు వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు కొత్త జంట రష్మిక, విజయ్ సందడి చేశారు. అల్లు శిరీష్ కి శుభాకాంక్షలు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories