Allu Sirish Engagement: యంగ్ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజాగా నయనికతో అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలు ఈ కథనంలో చూడండి.
అల్లువారి యంగ్ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి అడుగు పడింది. శుక్రవారం అక్టోబర్ 31న అల్లు శిరీష్ అతడి ఫియాన్సీ నయనిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కొన్ని వారాల క్రితం శిరీష్ తాను త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.
25
తుఫాన్ ఇబ్బంది పెట్టినప్పటికీ..
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. శిరీష్ నిశ్చితార్థం ఏర్పాట్లకి మొంథా తుఫాన్ ఇబ్బంది కలిగించినప్పటికీ చివరికి విజయవంతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. తాజాగా శిరీష్ తన నిశ్చితార్థం ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
35
అందంగా శిరీష్, నయనిక
ఈ ఫొటోల్లో వధూవరులు ఇద్దరూ అందమైన వస్త్రధారణలో మెరిసిపోతున్నారు. అల్లు శిరీష్ వైట్ డ్రెస్ లో, నయనిక రెడ్ కలర్ శారీలో అందంగా చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఇద్దరూ రింగులు మార్చుకుంటున్న ఫొటోస్ కూడా ఉన్నాయి.
ఫైనల్ గా నా నిశ్చితార్థం నా జీవితానికి ప్రేమ అయిన నయనికతో జరిగింది అని అల్లు శిరీష్ కామెంట్ పెట్టారు. దీనితో అభిమానులు అల్లు శిరీష్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో శిరీష్, నయనిక రెడ్డి వివాహం కూడా జరగనుంది. పెళ్లి వివరాలు త్వరలోనే బయటకి వస్తాయి. నయనిక రెడ్డి హైదరాబాద్ కి చెందిన అమ్మాయే. ఆమె బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరికి చాలా రోజులనుంచి పరిచయం ఉండడం, అది ప్రేమగా మారడం జరిగింది.
55
అతిథులు వీరే
నిశ్చితార్థం జూబ్లీ హిల్స్ లోని నివాసంలో జరిగింది. ఈ వేడుకకి అల్లు ఫ్యామిలీతో పాటు.. చిరంజీవి సురేఖ దంపతులు, రాంచరణ్ ఉపాసన దంపతులు, నాగబాబు పద్మజ దంపతులు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు.