దీపావళి వేడుకలలో ఏంజెల్ లా మెరిసిన అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి, ఆ గ్లామర్ ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే

First Published | Nov 8, 2021, 11:34 AM IST

ఓ స్టార్ హీరో వైఫ్ కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అల్లు అర్జున్ (Allu arjun) వైఫ్ స్నేహారెడ్డి కలిగి ఉన్నారు. గ్లామర్, కల్చర్, ఫ్యాషన్ వంటి విషయాల్లో ఆమె మెచ్యూరిటీ అద్భుతం. అల్లు అర్జున్ సహచరిగా, ఆయన పక్కన హీరోయిన్ ని తలపిస్తుంది స్నేహారెడ్డి.

తాజాగా దీపావళి వేడుకలలో స్నేహారెడ్డి (Snehareddy) ఏంజెల్ లా మురిసిపోయారు. గోల్డ్ కలర్ గాగ్రా చోళీ ధరించి ఆమె సూపర్ గ్లామరస్ గా కనిపించారు. ట్రెండీ డ్రెస్ లో స్నేహారెడ్డి భర్త ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన  ఫ్యాషన్ ఐకాన్ లా దర్శనం ఇచ్చారు. 
 

అల్లు అర్జున్ ఫార్మ్ హౌస్ లో నిర్వహించిన దీపావళి (Diwali 2021) వేడుకలలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీపావళి ప్రత్యేక డెకరేషన్ మధ్య అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పై ప్రత్యేక వీడియోలో రూపొందించారు. సదరు వీడియో, అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 
 



అల్లు అర్జున్ బ్లాక్ సూట్ లో జెంటిల్ లుక్ తో అదరగొట్టగా, స్నేహారెడ్డి తన బ్యూటీతో మెస్మరైజ్ చేసింది. అసలు స్నేహారెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నమ్మడం కష్టమే. బన్నీ, స్నేహారెడ్డి ఆ వీడియోలో నవ దంపతుల వలె కనిపించారు. ఏది ఏమైనా స్నేహా ప్రతి విషయంలో తన మార్కు చూపిస్తూ, భర్తకు తగ్గ భార్య అనిపిస్తుంది. 
 

2011 మార్చ్ 11న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డితో అల్లు అర్జున్ కి పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ లో విద్యాసంస్థలు నడుపుతున్న చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డి.

అల్లు అర్జున్ ప్రేమను అంగీకరించిన అల్లు అరవింద్ స్వయంగా చంద్రశేఖర్ రెడ్డితో సంబంధం మాట్లాడడానికి వాళ్ళ నివాసానికి వెళ్లారు. అయితే సినిమా వాళ్ళు అంటే నమ్మకం లేని చంద్రశేఖర్ రెడ్డి, ఈ సంబంధానికి ఒప్పుకోలేదు. అయితే స్నేహారెడ్డి పట్టుబట్టడంతో చంద్రశేఖర్ రెడ్డి వివాహం జరిపించారు.

సక్సెస్ ఫుల్ హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్న అల్లు అర్జున్, బాధ్యత గల భర్త, తండ్రి కూడాను. షూటింగ్ లేకపోతే అల్లు అర్జున్ సమయం అంతా కుటుంబానికే కేటాయిస్తారు. ముఖ్యంగా కూతురు అర్హతో ఆడుకోవడం ఆయనకు మహా సరదా. అర్హ బుజ్జి బుజ్జి మాటలతో కూడిన వీడియోలు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పంచుకుంటాడు. 

మరోవైపు పుష్ప (Pushpa)రిలీజ్ పనుల్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. క్రిస్మస్ కానుకగా పుష్ప విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ టీజర్ తో పాటు.. మూడు సాంగ్స్ విడుదల చేశారు.

Also read అల్లు అర్జున్ తో మహానటి...భారీ ప్లాష్ బ్యాక్

Also read క్రేజీ బజ్... మెగా 154లో పవన్ కళ్యాణ్ కూడా?

Latest Videos

click me!