కుంభస్థలాన్నే కొట్టబోతున్న ఐకాన్‌ స్టార్‌.. అల్లు అర్జున్‌ కేరాఫ్‌ హాలీవుడ్‌ సూపర్‌ హీరో.. ?

Published : Aug 26, 2022, 03:42 PM ISTUpdated : Aug 26, 2022, 09:34 PM IST

ఐకాన్‌ స్టార్‌  అల్లు అర్జున్‌ పేరు ఇప్పుడు ఇండియా వైడ్‌గా మారుమోగుతోంది. అల్లు అర్జున్‌ పేరే ఇప్పుడొక బ్రాండ్‌గా మారిపోయింది. దాన్ని మరింతగా పెంచబోతున్నారు బన్నీ. మైండ్‌ బ్లోయింగ్‌ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు.   

PREV
16
కుంభస్థలాన్నే కొట్టబోతున్న ఐకాన్‌ స్టార్‌.. అల్లు అర్జున్‌ కేరాఫ్‌ హాలీవుడ్‌ సూపర్‌ హీరో.. ?

అల్లు అర్జున్‌(Allu Arjun)కి `పుష్ప`(Pushpa) సినిమా ఇండియా వైడ్‌గా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఊహించని  సక్సెస్‌లో ఆయన పాన్‌ ఇండియా స్థాయిలో మారుమోగుతోంది. అల్లు అర్జున్‌ కంటే ఐకాన్‌ స్టార్‌గా, పుష్పరాజ్‌గానే అభిమానులు పిలుచుకుంటున్నారు. స్టయిల్‌కి కేరాఫ్‌గా నిలిచే బన్నీ అద్భుతమైన డాన్సులతోనూ వెండితెరపై మాయ చేశారు. అభిమానులకు పూనకాలు తెప్పించారు. 

26

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ప్లానింగ్‌ చూస్తుంటే మతిపోయేలా ఉంది. ఆయన నెక్ట్స్ లైనప్‌ షాకిచ్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఏకంగా హాలీవుడ్‌ రేంజ్‌లో దూసుకెళ్తున్నారు. త్వరలో ఆయన ఓ హాలీవుడ్‌ సినిమా కూడా చేయబోతున్నారనే టాక్‌ టాలీవుడ్‌లో  స్టార్ట్ అయ్యింది. అంతేకాదు సూపర్‌ హీరో సినిమాలో భాగం కాబోతున్నారని సమాచారం. 
 

36

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`కి రెడీ అవుతున్నారు. ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా, త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌కి కూడా స్టార్ట్ కాబోతుంది. `పుష్ప` భారీ విజయాన్ని సాధించడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. `పుష్ప2` కూడా సక్సెస్‌ అయితే బన్నీ పాన్‌ ఇండియా దాటి పాన్‌ వరల్డ్ యాక్టర్‌గా మారిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

46

ఇదిలా ఉంటే నెక్ట్స్ అల్లు అర్జున్‌ కుంభస్థలాన్నే  కొట్టబోతున్నారట. ఆయన ఓ హాలీవుడ్‌ సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల అల్లు అర్జున్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. భార్య స్నేహారెడ్డితో కలిసి ఆయన న్యూయార్క్ లో జరిగిన 40వ ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్నారు. గ్రాండ్‌ మార్షల్‌గా అల్లు అర్జున్‌కి ఘన స్వాగతం పలికారు న్యూయార్క్ మేకర్‌. వారితో కలిసి దిగిన ఫోటోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 

56

అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ని ఓ ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ కలిశారట. హాలీవుడ్‌లో సూపర్ హీరో (Super Hero)చిత్రాలు తీసే డైరెక్టర్‌ బన్నీని మీట్‌ అయ్యారని, వీరిద్దరి మధ్య ఓ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జరిగాయని తెలుస్తుంది. ఓ సూపర్‌  హీరో ప్రాంఛైజీలో బన్నీ నటించడానికి సంబంధించిన టాక్స్ జరిగినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అదే నిజమైతే ఐకాన్‌ స్టార్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమైనట్టే అని చెప్పొచ్చు. 
 

66

ఇదిలా ఉంటే బన్నీ చేతిలో చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయి. బోయపాటితో ఓ సినిమా, ప్రశాంత్‌ నీల్‌, బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇలా చాలా మందితో టాక్స్ ఉన్నాయి. మరి నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. ఇక `పుష్ప2`లో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories