భార్య అల్లు స్నేహారెడ్డి కోసం బన్నీ.. సక్సెస్‌ఫుల్‌గా ఫైర్ ఫ్లై కార్నివాల్..

Published : Jan 20, 2024, 10:17 PM IST

అల్లు అర్జున్‌ ఓ వైపు పాన్‌ ఇండియా స్టార్‌ గా రాణిస్తున్నారు. మరోవైపు తన భార్య అల్లు స్నేహారెడ్డిని వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఆమె చేపట్టిన ప్రాజెక్ట్ ని సక్సెస్‌ చేశాడు.  

PREV
15
భార్య అల్లు స్నేహారెడ్డి కోసం బన్నీ.. సక్సెస్‌ఫుల్‌గా ఫైర్ ఫ్లై కార్నివాల్..

బన్నీ వైఫ్‌ అల్లు స్నేహారెడ్డి..సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. స్టార్‌ వైఫ్‌ ఇలాంటి ఫోటో షూట్లు ఏంటని అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. కానీ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంది. 
 

25

ఆమె మోడల్‌గా మారిపోయింది. ఆ మధ్య ఓ యాడ్‌ కూడా చేసింది. దీంతో అల్లు స్నేహారెడ్డి ఫోటో షూట్‌ వెనుక పెద్ద ప్లానే ఉందని క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కార్యక్రమం చేపట్టింది. వ్యాపార పరంగా ఆమె ముందడుగు వేసింది. ఫైర్‌ ప్లై కార్నివాల్‌ని చేపట్టింది. పికాబు సంస్థతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. 
 

35

అల్లు స్నేహారెడ్డి సైతం వ్యాపారంలో ముందుంటుంది. అందులో భాగంగానే ఆమె పికాబు సంస్థతో కలిసి ఫైర్‌ ఫ్లై కార్నివాల్‌ ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో శనివారం ఈ ఈవెంట్‌ని నిర్వహించడం విశేషం. ఇదొక ఫ్యామిలీ కార్నివాల్‌ కావడం విశేషం. 
 

45

ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్ గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ కి ముఖ్య అతిధి గా వచ్చిన అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి కి, నాగు రెడ్డి, స్మిత రెడ్డి కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ : పుష్ప షూట్ మధ్యలో  నుంచి వచ్చాను. ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి, స్మిత రెడ్డి కి అభినందనలు తెలిపారు. 
 

55

ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప2`లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుంది. ఆర్‌ఎఫ్‌సీలో ఇటీవలే దీన్ని ప్రారంభించారు. ఇందులో జగదీష్‌ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో బెయిల్‌పై తీసుకొచ్చి షూటింగ్‌ చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించే ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్ట్ 15న దీన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories