Allu Ayaan Favorite Hero: అల్లు అర్జున్‌ కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తండ్రికే కాదు, చిరు తాత క్కూడా అల్లు అయాన్‌ ఝలక్‌

Published : Apr 28, 2026, 01:04 PM IST

అల్లు అర్జున్‌ ఇండియాలోనే పెద్ద సూపర్‌ స్టార్‌. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని కూడా అందుకున్నాడు. కానీ కొడుకు మనసుని గెలవలేకపోయాడు. అల్లు అయాన్‌ ఫేవరేట్‌ హీరో బన్నీ కాదట. 

PREV
14
అల్లు అర్జున్‌కి షాక్‌ ఇచ్చిన అల్లు అయాన్‌

అల్లు అర్జున్‌ ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు `రాకా`తో గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌పై కన్నేశారు. ప్రపంచ వ్యాప్తంగా తానేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పెద్ద స్టార్‌ అయినా తన సొంత కొడుకు విషయంలో షాక్‌ తినాల్సి వచ్చింది. బన్నీ.. తన కొడుకు మెప్పించిన హీరో కాకపోవడం గమనార్హం. మరి అల్లు అయాన్‌ కి ఇష్టమైన హీరో ఎవరు? ఆయన బాగా ఇష్టపడ్డ సినిమా ఏంటనేది చూస్తే.

24
అల్లు అర్జున్‌, చిరంజీవికి షాకిచ్చిన అల్లు అయాన్‌

అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిలకు కొడుకు అల్లు అయాన్‌, కూతురు అల్లు అర్హ జన్మించారు. అల్లు అయాన్‌.. వాళ్ల తాత రామలింగయ్య, అల్లు అరవింద్‌ మాదిరి చాలా హుషారుగా ఉంటాడట. తండ్రి మాటని కూడా లెక్కచేయకుండా తాను అనుకున్న పని చేస్తాడట. బన్నీనే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాడు. ఓ సారి షూటింగ్‌ కి వస్తానంటే అల్లు అర్జున్‌ వద్దన్నాడట. నువ్వేంటి నన్ను వద్దని చెప్పేదని, వచ్చి సెట్‌లో కూర్చున్నాడట. ఆ సినిమాకి నిర్మాత అల్లు అరవింద్‌. ఇది మా తాత సినిమా అని, నిర్మాత చైర్‌లో కూర్చొని షాక్‌ ఇచ్చాడట. అలాంటి అల్లు అయాన్‌.. తన ఫేవరేట్‌ హీరో విషయంలో సొంత తండ్రికి, అలాగే చిరంజీవి తాతకి కూడా షాకిచ్చాడు.

34
అల్లు అయాన్‌ ఫేవరేట్‌ హీరో ప్రభాస్‌

అల్లు అయాన్‌కి ఇష్టమైన హీరో ప్రభాస్‌ అట. ఆయన నటించిన `బాహుబలి` సినిమా అంటే ఇష్టమని, ఆయన యాక్షన్‌ బాగుంటుందని తెలిపారు. చిరంజీవి తాత డాన్సులు కూడా ఇష్టమని, కానీ ఓవరాల్‌గా చూస్తే ప్రభాసే ఫేవరేట్‌ హీరో అని తెలిపారు అయాన్‌. అల్లు అర్జున్‌ ముందే  బాలకృష్ణతో ఓపెన్‌గా ఈ విషయాన్ని పంచుకున్నాడు అయాన్‌. బాలకృష్ణ హోస్ట్ గా చేసిన `అన్‌ స్టాపబుల్‌` విత్‌ ఎన్బీకే టాక్‌ షోలో ఆ మధ్య అల్లు అర్జున్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఇద్దరు పిల్లలు అయాన్‌, అర్హలను కూడా తీసుకెళ్లాడు బన్నీ. అందులో భాగంగా నీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా ప్రభాస్‌ అని చెప్పాడు అయాన్‌. దీనికి బన్నీ నవ్వులు చిందించడం విశేషం. ఇలా అందరి ముందు సొంత తండ్రికి షాక్‌ ఇచ్చాడు అయాన్‌.

44
రాకాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌ `రాకా` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. సైన్స్ ఫిక్షన్‌ అంశాల మేళవింపుతో ఈ మూవీ రూపొందుతుంది. ఇటీవల విడుదల చేసిన బన్నీ ఫస్ట్ లుక్‌ గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంది. ఇందులో తోడేలుని పోలినట్టుగా బన్నీ లుక్‌ ఉంది. ఇందులో ఆయన నెగటివ్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనది మరో పాత్ర కూడా ఉందని, అందులో హీరోగా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో దీపికా పదుకొనె కీలక పాత్ర పోషిస్తోంది. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories