ఐకాన్‌స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. గతంలో నార్త్ లో రికార్డులు తిరగరాసింది పుష్ప చిత్రం. అల్లు అర్జున్ మేనరిజమ్స్ అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసేశాయి. నార్త్ లో పుష్ప రూ.108 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ‘పుష్ప’ కి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ (Pushpa2) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.