పుష్ప 2 బుక్‌మైషోలో కొత్త రికార్డు, ఎన్ని టిక్కెట్లు అమ్మారంటే

First Published | Jan 4, 2025, 7:30 AM IST

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బుక్‌మైషోలో 2 కోట్ల టిక్కెట్ల అమ్మకాలతో కొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1799 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బాహుబలి 2 రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

Allu Arjun, Pushpa 2, BookMyShow

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల పుష్ప 2 మాస్ జాతర దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. వివాదాలు ఎన్ని వచ్చినా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించటం లేదు. భాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ముఖ్యంగా నార్త్‌ ఇండియాలో ఊహించని స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి.

ఒక సౌత్‌ సినిమాకి, తెలుగు సినిమాకు హిందీ ప్రేక్షకులు ఇంతటి రెస్పాన్స్‌ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ బాలీవుడ్‌ బాక్సాఫీస్ విశ్లేషకులు సైతం అవాక్కవుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులు మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక తాజాగా పుష్ప 2 సినిమా  మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

 బుక్‌ మై షోలో పుష్ప 2 మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది.  రిలీజ్ కు ముందు నుంచి  పుష్ప 2 సినిమా బుకింగ్‌తో బుక్ మై షో సందడి మాములుగా లేదు. గంటకి లక్ష, అంతకు మించి టికెట్లు బుక్ మై షో లో బుక్ అవుతూనే ఉన్నాయి. వీక్‌ ఎండ్ లలో అయితే రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా బుక్ మై షోలో పుష్ప కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టిక్కెట్లు అమ్మకాలు 2 కోట్లు దాటాయని బుక్ మై షో స్వయంగా ప్రకటించింది. 

read more: జూ ఎన్టీఆర్‌ ప్రస్తావన రావద్దు అంటూ బాలయ్య కండీషన్‌? అన్‌స్టాపబుల్‌ షో గెస్ట్ లకు ముందే సూచన, ఇంత పగేంటి?


బుక్ మై షోలో పుష్ప 2 మొదటి నుంచి రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ చిత్రం మొదటి అయిదు రోజులు పూర్తి కాకుండానే పుష్ప 2కి బుక్‌ మై షో లో ఏకంగా 10 మిలియన్‌ల టికెట్లు బుక్‌ అయ్యాయి. అతి తక్కువ సమయంలో కోటి టికెట్లు అమ్ముడు పోయిన సినిమాగా పుష్ప 2 సినిమా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండు కోట్లు టిక్కెట్లు అమ్మిన రికార్డ్ తో నెక్ట్స్ లెవిల్ లో ఉంది.

Pushpa 2: The Rule,

ఇదిలా ఉంటే  'పుష్ప 2'  సినిమా నాలుగు వారాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిందని మేకర్స్ తాజాగా తెలిపారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ.1799 కోట్ల గ్రాస్​ వసూల్ చేసింది. ఈ మేరకు మేకర్స్​ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'పుష్ప 2 : ది రూల్‌ రికార్డు బ్రేకింగ్‌ రన్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తోంది. వైల్డ్ ఫైర్‌ బ్లాక్‌బస్టర్‌ నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1799 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది' అని పోస్ట్​ లో  రాసుకొచ్చింది.

also read: బ్రాహ్మణికి స్టార్ డైరక్టర్ నుంచి సినిమా ఆఫర్..స్వయంగా చెప్పిన బాలయ్య
 

తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన 'బాహుబలి 2'కు ఇది అతి సమీపంలోకి వచ్చింది. 2017లో రిలీజైన బాహుబలి 2 రూ.1810 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ లెక్కన పుష్ప 2 మరో వారంలో 'బాహుబలి 2' వసూళ్లు క్రాస్ చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేదు. మరో వారం రోజులు పుష్ప హవానే కొనసాగే అవకాశం ఉంది. ఇదే జరిగితే రూ.2000 కోట్ల మార్క్ క్రాస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 

గ్లోబ‌ల్ స్టార్‌ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప-2: ది రూల్' వ‌సూళ్ల సునామీ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో, బాలీవుడ్ లో సుప్రసిద్ధ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ ఓ ప్రకటన చేసింది. పుష్ప-2 టీమ్ మొత్తానికి శుభాభినందనలు తెలిపింది.  "రికార్డులున్నది బద్దలవడానికే. పాత రికార్డులు పోతుంటాయి... కొత్త రికార్డులు వస్తుంటాయి.

మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడుతుంటాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్నందుకు యావత్ పుష్ప-2 చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్. ఫైర్ నహీ... వైల్డ్ ఫైర్ (మామూలు ఫైరు కాదు... వైల్డ్ ఫైరు)" అంటూ యశ్ రాజ్ ఫిలింస్ తన ప్రకటనలో పేర్కొంది.
read more: త్రివిక్రమ్‌ కి షాక్‌.. అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్‌ తోనే?.. బన్నీ కొత్త రూల్‌

Latest Videos

click me!